`అబ్బాయ్-బాబాయ్` ఫ్యాన్స్ కి డ‌బుల్ ట్రీట్!

Update: 2021-09-18 13:36 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `భీమ్లా నాయ‌క్` చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. ఇందులో టాలీవుడ్ హంక్ రానా ప‌వ‌న్ కు ధీటైన పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. డేనియ‌ల్ శేఖ‌ర్ అత‌డి పాత్ర పేరు. సినిమా అంతా భీమ్లా వ‌ర్సెస్ డేనియ‌ల్! అనే తీరుగా ఈ రెండు పాత్ర‌ల మ‌ధ్యే క‌థాంశం తిరుగుతుంది. ఈగో గొడ‌వ‌ల నేప‌థ్యం ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌నుంది. ఈ రెండు పాత్ర‌లు నువ్వా? నేనా? అన్న రీతిన సాగుతాయి. ఇప్ప‌టికే ప‌వ‌న్ నాయ‌క్ లుక్ ని రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే . ఈ నేప‌థ్యంలో రానా పోషిస్తున్న డేనియ‌ల్ శేఖ‌ర్ పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్టు లుక్ పోస్ట‌ర్ ని సెప్టెంబ‌ర్ 20న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌నున్నారు. ఇదివ‌ర‌కూ సాంపిల్ గా ఓ ప్రీపోస్ట‌ర్ నికి కూడా వ‌దిలి హీట్ పెంచారు. డేనియ‌ల్ పాత్ర కూడా ఎంతో ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుంద‌ని ఈ పోస్ట‌ర్ చెప్ప‌క‌నే చెప్పింది.

సెప్టెంబ‌ర్ 20న మోష‌న్ పోస్ట‌ర్ కూడా వ‌చ్చేస్తే ఫ్యాన్స్ కి పండుగే. అయితే స‌రిగ్గా ఇదే రోజున విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `దృశ్యం-2` ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని కూడా రిలీజ్ చేస్తున్నారు. మోష‌న్ పోస్ట‌ర్ స‌రిగ్గా ఉద‌యం 10.8 గంట‌ల‌కు రిలీజ్ చేస్తున్న‌ట్లు ముహూర్తం ఫిక్స్ చేసారు. అలాగే సినిమా రిలీజ్ తేదీని కూడా ప్ర‌కటించే అవ‌కాశం ఉంది. ఇలా అబ్బాయ్-బాబాయ్ అనుకుని ద‌గ్గుబాటి అభిమానుల‌కు డ‌బుల్ ట్రీట్ ఇవ్వ‌డానికి రెడీ అయ్యారు. దృశ్యం భారీ స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో దృశ్యం-2పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మ‌ల‌యాళంలో పార్ట్ -2 కూడా పెద్ద హిట్ అవ్వ‌డంతో అదే ద‌ర్శ‌కుడు జీతు జోసేఫ్ నే తెలుగు రీమేక్ కోసం రంగంలోకి దించారు.

ఇక ఈ చిత్రాన్ని మాత్రం ఓటీటీ లో కాకుండా నేరుగా థియేట‌ర్లో రిలీజ్ చేసే అవ‌కాశాలున్నాయి. క‌రోనా ప‌రిస్థితులు కూడా మెరుగ్గానే ఉన్నాయి కాబ‌ట్టి థియేట‌ర్ రిలీజ్ కే ఎక్కువ ప్రాధాత‌న్య‌త క‌నిపిస్తోంది. `నార‌ప్ప` ఓటీటీ రిలీజ్ నేప‌థ్యంలో డిస్ట్రిబ్యూట‌ర్లు హ‌ర్ట్ అయ్యారు. అలాగే వెంకీ ఫ్యాన్స్ లోనూ అసంతృప్తి ఉంది. ఈ కార‌ణాలు స‌హా భారీ హైప్ ఉన్న చిత్రం కాబ‌ట్టి థియేట‌ర్ రిలీజ్ కి ఎక్కువ ఛాన్స్ క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం వెకంటేష్ అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `ఎఫ్ 3` లో న‌టిస్తున్నారు. గ‌తంలో ఇదే కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన `ఎఫ్-2` భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.


Tags:    

Similar News