యంగ్ ఆడియన్స్ అభిరుచి మారుతోందా? ఆ సినిమాలకు కొత్త క్రేజ్!
ముఖ్యంగా థియేటర్లలో ‘జెన్ జీ’ యువత ఈ ఫ్యామిలీ సినిమాకు ఫిదా అయిపోతుండటం ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్‌కు తెరలేపింది. ఆ విశేషాలు మీకోసం..
ప్రస్తుతం టాలీవుడ్ అంతా పాన్ ఇండియా, గ్యాంగ్‌స్టర్, గ్రాఫిక్స్ సినిమాల చుట్టే తిరుగుతోంది. భారీ బడ్జెట్‌తో తీస్తున్న ఈ సినిమాలు కొన్నిసార్లు లేట్ అవుతూ, నిర్మాతలకు భారంగా మారుతున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఎలాంటి హడావుడి, విఎఫ్ఎక్స్ (VFX) లేకుండా కేవలం కథను నమ్ముకుని వచ్చిన సమంత ‘మా ఇంటి బంగారం’ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా థియేటర్లలో ‘జెన్ జీ’ యువత ఈ ఫ్యామిలీ సినిమాకు ఫిదా అయిపోతుండటం ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్‌కు తెరలేపింది. ఆ విశేషాలు మీకోసం..
మూస కథల మధ్య ‘మా ఇంటి బంగారం’:
ఈ మధ్య కాలంలో మాఫియా, వింత శక్తులు, అడవుల బ్యాక్‌డ్రాప్ కథల హవా ఎక్కువైపోయింది. ఇలాంటి భారీ ఎలివేషన్ల కోసం కోట్లు కుమ్మరించడం వల్ల కొన్ని పెద్ద సినిమాలు మధ్యలోనే ఆగిపోయి నష్టాలు తెస్తున్నాయి. కానీ, వీటికి భిన్నంగా ఎలాంటి గ్రీన్ మ్యాట్లు, విదేశీ ప్రయాణాలు లేకుండా సింపుల్ కంటెంట్‌తో వచ్చింది మా ఇంటి బంగారం. పరిమిత బడ్జెట్‌లో, కథ పరిధి దాటకుండా పక్కా ప్లానింగ్‌తో తీసి నిర్మాతలను సేఫ్ జోన్‌లోకి తెచ్చింది.
క్రేజీ కాంబో.. క్లీన్ ఫ్యామిలీ స్టోరీ:
ప్రముఖ రచయిత రాజ్ నిడిమోరు అందించిన చక్కటి కుటుంబ కథకు, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను అద్భుతంగా పండించగల దర్శకురాలు నందిని రెడ్డి తన అనుభవాన్ని జోడించారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సమంత తన నటనతో మ్యాజిక్ చేసింది. ఇక ఫలితంగా సమంత కెరీర్‌లోనే ఇదొక భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఎలాంటి అశ్లీలత లేని ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా అందరి మనసులు గెలుచుకుంది.
మారిన జెన్ జీ ఆడియన్స్ మైండ్‌సెట్:
సాధారణంగా ఫ్యామిలీ సినిమాలకు కేవలం పెద్దవాళ్లే వస్తారనే టాక్ ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో యువత ఆలోచనలు మారాయని స్పష్టమైంది. తాజాగా ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో మహిళల కోసం వేసిన ఒక స్పెషల్ షోలో, స్క్రీన్ దగ్గరకు వెళ్లి మరీ పాటలకు డ్యాన్స్ చేసింది పాతికేళ్ల లోపు ఉన్న యువతులే దీన్ని బట్టి కేవలం యాక్షన్ సినిమాలే కాదు, మనసుకు హత్తుకునే సెంటిమెంట్ కథలను కూడా నేటి తరం యువత ఎంతగానో ఇష్టపడుతోందని అర్థమవుతోంది.
ఇండస్ట్రీలో చరిత్ర పునరావృతం:
గతంలో కూడా ఇలాంటి ట్రెండ్స్ వచ్చాయి. అంతా యాక్షన్ సినిమాల వెనుక పడుతున్న టైంలోనే నాగార్జున ‘నిన్నే పెళ్లాడతా’, వెంకటేష్ ‘కలిసుందాం రా’, ఎన్టీఆర్ ‘బృందావనం’, ప్రభాస్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’, వంటి సినిమాలు వచ్చి ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతోంది.
సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ ఒకే ఫార్ములాతో నడవదు. భారీ యాక్షన్ సినిమాలతో పాటు, సినిమాలు వేగంగా పూర్తి కావాలన్నా, నిర్మాతలు సేఫ్ అవ్వాలన్నా మన రచయితలు మళ్లీ "కుటుంబ కథా చిత్రాల" వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ‘మా ఇంటి బంగారం’ ఇచ్చిన జోష్‌తో టాలీవుడ్‌లో మరిన్ని మంచి ఫ్యామిలీ సినిమాలు వస్తాయని ఆశిద్దాం.