ప్లాన్ బి కోసం యాడ్లు కూడానా..

Update: 2018-01-13 05:29 GMT
సినిమా సక్సెస్ అవ్వకపోయినా పరవాలేదు గాని డిజాస్టర్ అయితే మాత్రం ఒక్కసారిగా నిర్మాతల లైఫ్ మారిపోతుంది. కనీసం యావరేజ్ అయితే ఎంతో కొంత నష్టపోకుండా ఉండవచ్చు. అది దర్శకులకు హీరోలకు కూడా చాలా మంచి పరిణామం. అందుకే మన హీరోలు కథలు మినిమమ్ సక్సెస్ రేట్ అని అనిపిస్తేనే చేయడానికి సిద్ధపడతారు. కానీ ఒక్కోసారి వారు తీసుకున్న నిర్ణయాలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై కూడా అందరు ఆ విషయంపైనే చర్చించుకుంటున్నారు. అజ్ఞాతవాసిపై ఉన్న అంచనాలు ఇప్పటి వరకు పవన్ కేరిర్ లో ఏ సినిమాకు రాలేదు. అందులోను త్రివిక్రమ్ దర్శకుడు అవ్వడంతో భారీ క్రేజ్ అంటుకుంది. కానీ త్రివిక్రమ్ దర్శకత్వ లోపం సినిమాలో కరెక్ట్ గా కనిపించింది. ఇక అసలు విషయానికి వస్తే.. సినిమా నష్ఠాలను రికవర్ చేసుకోవడానికి ఇప్పుడు నిర్మాతలు అష్టకష్టాలు పడుతున్నారు.  బయ్యర్లు కూడా ఆవేదనను వ్యక్తం చేస్తుండడంతో వెంకటేష్ సీన్లను జతచేసి హైప్ తేవాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం కొన్ని పోస్టర్లను కూడా రిలీజ్ చేస్తూ ప్రమోషన్స్ ని పెంచుతున్నారు. అంతే కాకుండా ఇప్పుడు పవన్ అండ్ వెంకీ ఫోటోలతో కొత్తకొత్త యాడ్లు కూడా ఇచ్చేశారు. పేపర్లలో కూడా ఆ యాడ్స్ సందడి మనం చూడొచ్చు.

రీసెంట్ గా డబ్బింగ్ మేకింగ్ వీడియో ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక వెంకటేష్ సిన్ కు సంబందించిన సీన్ తప్పకుండా సినిమాకు కలెక్షన్స్ ని తెస్తుంది అని నమ్మకంతో ఉన్నారు. మరి ప్లాన్ బి తో నష్టాలు ఏమైనా రికవర్ అవుతాయో లేదో చూడాలి. 
Tags:    

Similar News