• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వెంకీ- నాని...

వెంకీ- నాని మ‌ల్టీస్టార‌ర్

By - Tupaki Desk
Update: 2019-04-16 04:35 GMT
నానీ వ‌రుస‌గా మ‌ల్టీస్టార‌ర్ల‌కు సంత‌కాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఓవైపు సోలో సినిమాలు చేస్తూనే సీనియ‌ర్ హీరోల‌తో క‌లిసి న‌టించేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. 2018లో కింగ్ నాగార్జున‌తో క‌లిసి దేవ‌దాస్ చిత్రంలో న‌టించారు. ప్ర‌స్తుతం సుధీర్ బాబుతో క‌లిసి వ్యూహం అనే చిత్రంలో న‌టిస్తున్నారు. ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత నానీ మ‌రో మ‌ల్టీస్టార‌ర్ లో న‌టిస్తే అది విక్ట‌రీ వెంక‌టేష్ తో ఉంటుంద‌ని `జెర్సీ` ప్రీరిలీజ్ వేడుక‌లో నాని స్వ‌యంగా క్లూ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రం.

నాని- వెంకీ కాంబినేష‌న్ అంటే సౌండింగే క్రేజీగా ఉంది. ఇద్ద‌రు నేచుర‌ల్ స్టార్స్ క‌లిసి న‌టిస్తే ఎలా ఉంటుందో చూడాల‌న్న ఆస‌క్తి అభిమానుల్లోనూ ఉంది. వెంకీ కామిక్ టైమింగ్.. నాని స‌హ‌జ‌సిద్ధ‌మైన పెర్ఫామెన్స్ క‌లిస్తే బ్లాక్ బ‌స్ట‌రే. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తో క‌లిసి వెంకీ `ఎఫ్ 2` చిత్రంలో న‌టించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు. అనీల్ రావిపూడి ప్ర‌స్తుతం సీక్వెల్ ఎఫ్ 3 కి క‌థ రాస్తున్నారు కాబ‌ట్టి అందులో నేచుర‌ల్ స్టార్ ని కూడా జాయిన్ చేసుకునే వీలుందా? అంటూ మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. నాకు ఎక్కువ మంది నువ్వు వెంకీ క‌లిసి సినిమా చేస్తే ఎంతో బావుంటుంద‌ని అన్నార‌ని నాని జెర్సీ వేదిక‌పైనే చెప్పారు. అందుకోసం వేచి చూస్తున్నాన‌ని అన్నారు.

జెర్సీ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ ``వెంకటేష్‌ గారు ఆవకాయలాంటి వ్యక్తి. ఆయన నచ్చని తెలుగువారు ఉండరు. నేను పెద్ద తెర‌పై చూసిన ఒక స్టార్‌ ని నేరుగా బ‌య‌ట‌ కలిసినప్పుడు మ‌న‌స్ఫూర్తిగా నచ్చింది వెంకటేష్‌ గారిని చూసినప్పుడే. ఆయన సినిమా వేడుక‌కు వెళ్లాలనే నా కోరిక `బాబు బంగారం` సినిమాతో నెర‌వేరింది. ఆయ‌న నా ఫంక్ష‌న్ కి రావాల‌నే కోరిక నేటితో తీరింది`` అని అన్నారు. ``నాకు `జెర్సీ` చాలా స్పెషల్‌ సినిమా. ఏప్రిల్‌ 19న అందరూ చాలా గర్వపడతారు. గౌతమ్‌ ని చూసి.. అర్జున్‌ ని చూసి.. నానీని చూసి.. శ్రద్ధను చూసి అందరూ గర్వపడతారు. మా నాన్న, మా అబ్బాయి అందరూ గర్వపడతారు. అందరూ గర్వించదగ్గ సినిమాలో నేను నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. గొప్ప సినిమాలో చేశాననే సంతృప్తి ఉంది. ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ముందు గౌతమ్‌ గురించి చెప్పాలి. ఈ నెల 19న అతను తీసిన సినిమానే మాట్లాడుతుంది. గౌతమ్‌ చాలా పెద్ద డైరక్టర్‌ అవుతాడని గౌతమ్‌ కొడుక్కి ఇవాళ చెబుతున్నా. గౌతమ్‌ కొడుకు పెద్దయ్యాక వాళ్ల నాన్ననే స్ఫూర్తిగా తీసుకుంటాడు. `జెర్సీ` ట్రైలర్‌ స్టైల్‌ లోనే చెప్పాలంటే, ఇంత పెద్ద ప్రపంచంలో ఇప్పటిదాకా నన్ను జడ్జి చేయంది తెలుగు ప్రేక్షకులు మాత్రమే. వాళ్ల దృష్టిలో నేను కొంచెం తగ్గినా తట్టుకోలేను. ఏప్రిల్ 19 డిసైడ్ చేస్తుంది`` అని అన్నారు.
    
    
    

Tags:    
  • Venkatesh 
  • Hero Nani 
  • Jersey Movie Pre Release 
  • Latest News 
  • telugu News 

Similar News

దీపావళి వేళ స్పెషల్ ఫొటోషూట్.. విమర్శలు ఎదుర్కొంటున్న రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-09 08:37 GMT

ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆదరిస్తారా? స్టార్ హీరోల సినిమాల మధ్య చిన్న మూవీకి సవాలే!

2026-11-09 08:33 GMT

కుర్రకారుకు కొత్త క్రష్.. ఆకట్టుకునే అందంతో!

2026-11-09 08:17 GMT

డిజాస్టర్ టాక్ తో 100 రోజులు ఆడిన సినిమా.. ఇదేమి ట్విస్ట్ రా బాబు!

2026-11-09 08:17 GMT

చిన్నప్పుడు అలా ఉండి ఉంటే బాగుండేది.. జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

2026-11-09 07:57 GMT

శతదినోత్సవాలలో ఆ హీరో లెక్క వేరు ... ఏ స్టార్‌కు సాధ్యం కాని రికార్డు ఇదే!

2026-11-09 07:56 GMT

హీరోయిన్లకే ఎందుకింత ఒత్తిడి.. జాన్వి, రాధిక తర్వాత తన బాధను బయటపెట్టిన కీర్తి సురేష్!

2026-11-09 07:56 GMT

ఊపేయ‌డానికి రెడీ అయిన క్లాస్ భామ‌లు!

2026-11-09 07:56 GMT

లిటిల్ హార్ట్స్ ఫస్ట్ ఛాయిస్ నేనే.. కానీ.. ఆ అదృష్టం ఇప్పుడు దొరికింది!

2026-11-09 07:55 GMT

సరైన దారి తెలియకపోయినా.. విజయ్ బాటలో మాత్రం నడవని సూర్య!

2026-11-09 06:59 GMT

మ‌ళ్లీ హ్యాట్రిక్ కొట్టిన సూర్య‌!

2026-11-09 06:41 GMT

రివ‌ర్స్ గేమ్ మొద‌లు పెట్టిన స‌తీమ‌ణి!

2026-11-09 06:21 GMT

Copyright @2026

Powered by Blink CMS