క్రిష్.. వెంకటేష్.. కాపీ కహానీ ఏంటంటే

Update: 2017-02-17 16:17 GMT
దర్శకుడు క్రిష్ తో తన 75వ చిత్రం చేయాలని భావించాడు సీనియర్ స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేష్. ఈ ప్రాజెక్టుపై క్రిష్ టీం నుంచి అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అంతా ఓకే అనుకుంటున్న టైంలో చివరకు.. ఈ ప్రాజెక్టు రద్దయిపోయింది. దీనికి కాపీరైట్ సమస్య అని ముందే చెప్పుకున్నాం. ఇంతకీ అసలా కాపీరైట్ కహానీ ఏంటంటే..

కేశవరెడ్డి అనే రచయిత 1984లో 'అతడు అడవిని జయించాడు' అనే పేరుతో ఓ నవలను రాశాడు. ఈ కథలో హీరో ఓ కడుపుతో ఉన్న పందిని వెతుక్కుంటూ అడవిలోకి వెళతాడు. సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం కల్లా కథ అయిపోతుంది. బయటకు వచ్చేసరికి తను ఓ కొత్త మారిన మనిషిగా.. కొత్త వ్యక్తిత్వంతో అడవిలోంచి వస్తాడు హీరో. ఈ కథలోంచి పంది ఎపిసోడ్ ను మాత్రం తీసేసి.. తనదైన శైలిలో మార్చుకుని సినిమా చేయాలని భావించాడట క్రిష్. అలాగే ఈ నవలకు సంబంధించిన హక్కులు కొందామని కూడా భావించాడట.

కానీ డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే.. అవార్డ్ విన్నర్ అయిన దూలం సత్యనారాయణ అనే డాక్యుమెంటరీ ఫిలింమేకర్.. ఇప్పటికే ఆ నవల హక్కులు కొనుక్కున్నాడు. చిత్తూరు జిల్లా అడవులు.. ఆదిలాబాద్ దండకారణ్యం.. ఇలా లొకేషన్స్ కూడా ఫిక్స్ చేసుకున్నాడు. త్వరలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కి వెళ్లి ఫండ్స్ సమీకరించాలని కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న దగ్గుబాటి ఫ్యామిలీ.. సింపుల్ గా సినిమా క్యాన్సిల్ చేసేసుకున్నారు.

కోరి వివాదం తెచ్చుకోవడం ఇష్టం లేక తప్పుకున్నాడు వెంకటేష్. కథ నచ్చినపుడు ముందుగానే రైట్స్ కొనుగోలు చేసి ఉంటే క్రిష్ కి ఇప్పుడీ ఇబ్బంది తప్పేది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News