ఆ ఫ్లాప్ మూవీ వెంక‌టేశ్ ఫేవరేట్ సినిమా అంట...!

Update: 2020-04-16 00:30 GMT
విక్టరీ వెంకటేష్ - భూమిక హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'వాసు'. ఈ సినిమా వచ్చి ఇప్పటికి 18 ఏళ్ళు గడిచింది. తల్లిదండ్రులు వారి కలలను పిల్లలపై బలవంతంగా రుద్దకూడదనే సందేశాన్ని తెలుపుతూ పూర్తి వినోదాత్మకంగా.. మ్యూజికల్‌ ఎంటర్టైనర్ గా రూపొందిన చిత్రం ‘వాసు. సీసీ మీడియా ఎంటర్‌ టైన్మెంట్‌ పై కేఎస్‌ రామారావు నిర్మించిన ఈ చిత్రానికి కరుణాకరన్‌ దర్శకత్వం వహించారు. 'వాసు' సినిమా పేరు మదిలో మెదలగానే అందరికి గుర్తొచ్చేవి పాటలు. ఈ సినిమాకి హారిస్‌ జయరాజ్‌ అందించిన పాటలు అప్పట్లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయి. 'ఓ ప్రేమా.. ఓ ప్రేమా..' అంటూ సాగే పాట సంగీత ప్రియుల్ని ముఖ్యంగా ప్రేమికులను ఎంతగానో అలరించింది. అయితే ఈ సినిమా అప్ప‌ట్లో భారీ అంచ‌నాల‌తో రిలీజైన‌ప్ప‌టికీ సినిమాలో వెంకీని మ్యూజిక్ స్టార్ గా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయ‌లేక‌పోయారు. అందుకే ఈ చిత్రం పరాజయాన్ని మూట గట్టుకుంది.

కానీ 'వాసు' వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ టీవీల్లో ఈ చిత్రం వస్తే మాత్రం ఛానల్‌ మార్చకుండా చూసేవారు అనేకమంది ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. ఎక్కడా బోర్‌ కొట్టకుండా ప్రతీ సీన్‌ ను చాలా చక్కగా ప్రజెంట్‌ చేశాడు దర్శకుడు కరుణాకరన్‌. కొన్ని సినిమాలను హీరోలు ఎంతో ఇష్టపడి.. ఖచ్చితంగా విజయ సాధిస్తాయనే నమ్మకంతో తీస్తుంటారు. కానీ వారు ఒకటి అనుకుంటే ఫలితం ఇంకోలా వస్తుంది. ఆ కోవకే చెందుతుంది 'వాసు'. ఇదిలా ఉండగా ఈ సినిమా ఫ్లాప్ అయినా వెంక‌టేశ్ కి మాత్రం ఈ సినిమా అంటే బాగా ఇష్ట‌మ‌ట‌. కారణం ఈ సినిమాలో ఉన్న కంటెంట్. ఒక ర‌కంగా చెప్పాలంటే ఈ సినిమాకి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు ఏ మీడియం రేంజ్ హీరోతో తీసినా వ‌ర్క్ అవుట్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఎలాగూ ద‌గ్గుబాటి ఫ్యామిలీ నుంచి రానా త‌మ్ముడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలి. ఇలాంటి ఓ ఛాలెంజింగ్ స్టోరీతో టాలీవుడ్ ఎంట్రీ ఇప్పిస్తే సరిపోతుంది కదా అని నెటిజ‌న్స్ వెంకీకి హింట్స్ ఇస్తున్నారు. మరి ద‌గ్గుబాటి ఫ్యామిలీ ఆ దిశగా అడుగులు వేస్తారేమో చూడాలి.


Tags:    

Similar News