• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగా కుర్రాడు.. మళ్లీ అదే...

మెగా కుర్రాడు.. మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా?

By - Tupaki Desk
Update: 2016-02-23 11:30 GMT
కెరీర్ ఆరంభంలో ఏ యువ కథానాయకుడూ చేయని సాహసాలు చేశాడు మెగా కుర్రాడు వరుణ్ తేజ్. ఓ పెద్ద ఫ్యామిలీకి చెందిన కొత్త కుర్రాడు ‘ముకుంద’ లాంటి సినిమాతో అరంగేట్రం చేస్తాడని ఎవ్వరూ ఊహించరు. అదే చిత్రమైతే.. ఆ తర్వాత ‘కంచె’ లాంటి మరో రిస్కీ ప్రాజెక్టులో నటించి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు వరుణ్. ఈ రెండు సినిమాలూ కమర్షియల్ గా అనుకున్న స్థాయిలో ఆడకపోయినా.. వరుణ్ మాత్రం మంచి పేరే సంపాదించాడు. ఐతే ఎప్పుడూ ఇలాంటి సినిమాలే ఏం చేస్తాంలే అని.. మాస్ ఇమేజ్ తెచ్చుకునే ఉద్దేశంతో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘లోఫర్’ చేశాడు వరుణ్. ఐతే ఆ సినిమాతో అతను కోరుకున్న ఇమేజ్ రాకపోగా.. ఉన్న పేరు కూడా పోయింది. రెంటికీ చెడ్డట్లు తయారైంది పరిస్థితి.

దీంతో మళ్లీ పాత దారిలోకి వెళ్లిపోయి క్రిష్ దర్శకత్వంలోనే ‘రాయబారి’ చేయాలనుకున్నాడు వరుణ్. అదే సమయంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ మూవీని కూడా లైన్లో పెట్టాడు. ఐతే ఇప్పుడు రాయబారి ఆగిపోయింది. మలినేని సినిమా పక్కకు వెళ్లిపోయింది. శ్రీను వైట్ల సినిమా తెరమీదికి వచ్చింది. ఐతే ఈ సినిమా వరుణ్ కెరీర్ కు ఎంత వరకు ఉపయోగపడుతుందా అన్నది సందేహంగా మారింది. గత కొన్నేళ్లుగా పూరి జగన్నాథ్ ట్రాక్ రికార్డు ఎలా ఉందో చూసుకోకుండా ‘లోఫర్’ చేసి దెబ్బ తిన్న వరుణ్.. ఆగడు - బ్రూస్ లీ లాంటి సినిమాలతో బోల్తా కొట్టిన వైట్లతో పని చేయాలనుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అసలే తన కెరీర్ అటు ఇటుగా ఉన్నపుడు.. వరుణ్ ఇలాంటి సాహసం చేయడం అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఈ సినిమాతో వరుణ్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.
Tags:    
  • Varun Tej 
  • Srinu Vaitla 
  • telugu NEws 

Similar News

ధనుష్ స్టోరీ సెలెక్షన్ మారిపోతుందా?

2026-11-21 09:59 GMT

ఇడుపు కాయితం.. ఈసారి పందిట్లో పల్లెటూరి పెళ్లి పాట

2026-11-21 09:53 GMT

వ‌య‌సు ఒక నంబ‌ర్ మాత్ర‌మే.. శ్రీ‌య ది గ్రేట్!

2026-11-21 09:52 GMT

గ్యాప్ తర్వాత కమ్‌బ్యాక్ & కొత్త దర్శకుల నిరీక్షణ!

2026-11-21 09:51 GMT

ఏఐ విజువల్స్ పై రాంగోపాల్ వర్మ అదిరిపోయే కౌంటర్!

2026-11-21 08:39 GMT

అంచనాలను మించి ENE Repeat వసూళ్లు.. వీకెండ్‌లో మరింత జోరు!

2026-11-21 08:39 GMT

ఈ ఇయర్ టాప్ లో నిలిచిన హీరో అతనే...

2026-11-21 08:38 GMT

నవంబర్ 27 బాక్సాఫీస్ పోరు: భోగి vs మైసా!

2026-11-21 08:35 GMT

మళ్లీ మొదటికొచ్చిన చరణ్!

2026-11-21 08:35 GMT

సమంత కొడుకు పేరు వెనుక కథ ఏమిటి?

2026-11-21 08:35 GMT

పాత్ర కాదు పాత్ర‌లో డెప్త్ కావాలంటోన్న యువ భామ‌లు!

2026-11-21 08:35 GMT

పుస్తకం పై కవర్ చూసి జడ్జ్ చేయొద్దు!

2026-11-21 07:30 GMT

Copyright @2026

Powered by Blink CMS