వరుణ్ కి పరిణయ ప్రణీతం

Update: 2015-12-01 03:43 GMT
వరుసపెట్టి రెండు విజయాలతో టాలీవుడ్ లో పాతుకుపోయిన యువహీరో వరుణ్ సందేశ్ కి ఇటీవల కాలంలో హిట్ లేదు. అయితే తన జీవితంలో శుభపరిణామాలు త్వరలో చోటు చేసుకోనున్నట్లుగా సమాచారం. వరుణ్ నేటి తరం ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరు. అయితే సమీప భవిష్యత్తులో ఆ బ్యాచిలర్ డిగ్రీని కోల్పోనున్నట్టు తెలుస్తుంది.

అవును వరుణ్ సందేశ్ పెళ్లికొడుకు కాబోతున్నాడు. కధానాయిక ప్రణీతీ వీతికతో అంగరంగ వైభవంగా వరుణ్ పెళ్లి జరగనుంది. వీరిద్దరూ కలిసి పడ్డానండీ ప్రేమలో మరి అనే సినిమాలో నటించారు. అప్పుడు చిగురించిన స్నేహం ప్రేమగా మారి పెద్దలను ఒప్పించి పెళ్ళికి దారి తీసిందని సమాచారం. డిసెంబర్ లో నిశ్చితార్ధ వేడుకలు జరగనున్నాయి.

ఇటీవల కాలంలో పెళ్లికొడుకులుగా మారిన నాని, గోపీచంద్ తమ జీవితభాగస్వాములుగా ఆఫ్ స్క్రీన్ అమ్మాయిలను ఎంచుకుంటే వరుణ్ సినిమా రంగానికి చెందిన అమ్మాయిని చేసుకోవడం విశేషం. చాలా రోజుల తరువాత హీరో హీరోయిన్లు వరుడు - వదువులుగా మారుతున్న సందర్భం రానుందన్నమాట. కంగ్రాట్స్ వరుణ్ అండ్ ప్రణీతీ!!!!
Tags:    

Similar News