• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స‌మంత‌తో జ‌ట్టు క‌డుతున్న...

స‌మంత‌తో జ‌ట్టు క‌డుతున్న వ‌ర‌ల‌క్ష్మి

By - Tupaki Desk
Update: 2021-12-10 02:30 GMT
నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌రువాత కొంత విశ్రాంతి తీసుకున్న స‌మంత మళ్లీ ట్రాక్‌ లోకి వ‌చ్చేసింది. ఎప్ప‌టి లాగే మ‌ళ్లీ వరుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం మొద‌లుపెట్టింది. గుణశేక‌ర్ తెర‌కెక్కిస్తున్న చారిత్ర‌క చిత్రం `శాకుంత‌లం` షూటింగ్ ని ఇటీవ‌లే పూర్తి చేసిన స‌మంత వెంట‌నే త‌న త‌దుప‌రి చిత్రానికి రెడీ అయిపోయంది. ప్ర‌స్తుతం త‌మిళంలో న‌య‌న‌తార ప్రియుడు విగ్నేష్ శివ‌న్ రూపొందిస్తున్న `కాదువాకుల రెండు కాద‌ల్‌` చిత్రంలో న‌టిస్తున్న స‌మంత తాజాగా శ్రీ‌దేవి మూవీస్ అధినేత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ చిత్రాన్ని ఓకే చేసింది.

లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి `య‌శోద‌` అనే టైటిల్‌ని ఇప్ప‌టికే ఫైన‌ల్ చేశారు. ఇటీవ‌లే ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ గా అబ్బుర‌ప‌రిచే క‌థ‌తో రూపొంద‌నున్న ఈ చిత్రంలో హీరో క్యారెక్ట‌ర్ అంటూ ఏదీ వుండ‌ద‌ని, సామ్ పాత్రే ఈ చిత్రానికి హీరో అని చెబుతున్నారు. ఇక ఇందులో క‌థాను సారం ఓ ముఖ్య పాత్ర వుంద‌ట‌. ఆ పాత్ర కోసం త‌మిళ హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ని మేక‌ర్స ్ తాజాగా ఎంపిక చేసిన‌ట్టు తెలిసింది.

సినిమాలో వ‌ర‌ల‌క్ష్మీ క్యారెక్ట‌ర్ చాలా స్పెష‌ల్ గా వుంటుంద‌ని, ఈ మ‌ధ్య కాలంలో ఆమె చేయ‌ని స‌రికొత్త పాత్ర ఇద‌ని చెబుతున్నారు. మాస్ రాజా ర‌వితేజ న‌టించిన `క్రాక్‌` చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మీ జ‌య‌మ్మ‌గా న‌టించి శ‌భాష్ అనిపించుకున్న విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత అల్ల‌రి న‌రేష్ `నాంది`లోనూ అత‌న్ని కాపాడే లాయ‌ర్ ఆద్య‌గానే త‌న‌దైన న‌ట‌నతో ఆక‌ట్టుకోవ‌డంతో తెలుగులో వ‌ర‌ల‌క్ష్మికి మంచి డిమాండ్ ఏర్ప‌డింది. అదే స‌మంత `య‌శోద‌`లో వ‌రుకు కీల‌క పాత్ర‌లో న‌టించే అవ‌కాశాన్ని అందించింది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.
Tags:    
  • Ya?soda? 
  • Samantha 
  • samantha songs 
  • samantha movies 
  • samantha pics 
  • pushpa 
  • webseries 
  • family man 2 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS