'వకీల్ సాబ్' విషయంలో ఆ ఒక్కటీ కొలిక్కి రాలేదా..?

Update: 2021-03-19 11:41 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ అనేవి చాలా ఫేమస్. ఓ స్టార్ హీరో సినిమా విడుదలకు రెడీ అయిందంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ ఎదురుచూసేది ప్రీ-రిలీజ్ కోసమే. కోవిడ్ తర్వాత ప్రీ-రిలీజ్ ఫంక్షన్స్ భారీ ఎత్తున జరుపట్లేదు మేకర్స్. చిన్నపాటి గ్రౌండ్ చూసి కానిచేస్తున్నారు. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ విషయంలో నిర్మాతలు సంధిగ్దంలో పడ్డారు. వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ వేడుకలు అంటే ఏ రేంజిలో ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. అసలే పవన్ కళ్యాణ్ మూడేళ్ల రాజకీయం తర్వాత తెరమీద కనిపించనున్నాడు. ఓవైపు సినిమా ఫ్యాన్స్ మరోవైపు పొలిటికల్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ని ఎప్పుడెప్పుడు తెరమీద చూద్దామా అని ఆత్రంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో.. ఓవైపు కరోనా భయం, మరోవైపు ప్రీ-రిలీజ్ లేకపోతే అభిమానులకు కిక్కుండదు.

ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్.. ప్రీ-రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఇద్దరూ హాజరు కాబోతుండటం మరో విశేషం. పవర్ స్టార్ సినిమాకు ప్రీ-రిలీజ్ సెలెబ్రేషన్స్ లేకపోతే ఏమాత్రం ఫ్యాన్స్ సంతృప్తి చెందలేరు. అసలే మెగాఫ్యాన్స్ హవా ఇలాంటి సినిమా వేడుకల్లో భీభత్సంగా ఉంటుంది. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటే.. అందులోను మరో ఇద్దరు మెగాహీరోలు అతిథులుగా రాబోతుంటే.. కరోనా భయంతో ఫంక్షన్ జరపాలా వద్దా అనే సందేహంలో నిర్మాతలు. నిజానికి నిర్మాత దిల్ రాజు గ్రాండ్ గా చేయాలనీ ఆలోచనలో ఉన్నాడట. కానీ శ్రీకారం విషయంలో ఓ మనిషి చనిపోవడం గుర్తొచ్చి ఆగుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే జనాలు ఓ రేంజిలో హాజరవుతారు. వాళ్లను కంట్రోల్ చేయడం గగనం అవుతుంది. అందుకే వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ విషయాన్నీ పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టాడట నిర్మాత. పవన్ ఓకే అంటే ఉంటుంది లేదంటే లేదు అనేది క్లారిటీ రానుంది. మరి ఎప్పుడు ఎక్కడ అనేది ఎవరికి తెలియదు. చూడాలి మరి ప్రీ-రిలీజ్ ఉంటుందా లేదా అనేది. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ విడుదల కాబోతుంది.
Tags:    

Similar News