2020లో అత్యధిక ట్వీట్స్ చేయబడిన తెలుగు చిత్రంగా 'వకీల్ సాబ్'
ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ప్రతి ఏడాది అత్యధిక ట్వీట్స్ ఏ అంశాలపై చేశారో అనే విషయాన్ని వెల్లడిస్తూ ఉంటుంది. తాజాగా ట్విట్టర్ 2020లో జరిగిన పలు అంశాల మీద రిపోర్ట్స్ విడుదల చేసింది. ఎంటర్టైమెంట్ విభాగంలో ఈ ఏడాది అత్యధిక ట్వీట్స్ చేయబడిన తెలుగు సినిమాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ''వకీల్ సాబ్'' నిలిచింది. పవన్ రీ ఎంట్రీ మూవీగా వస్తున్న 'వకీల్ సాబ్' కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చేస్తున్నారు. హిందీ 'పింక్' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇందులో పవన్ లాయర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. చివరి దశకు చేరుకున్న 'వకీల్ సాబ్' షూటింగ్ కోవిడ్ నేపథ్యంలో ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఈ చిత్రంలో నివేధా థామస్ - అంజలి - అనన్య వంటి హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. కాగా, మొత్తం మీద నెటిజన్లు అధికంగా ట్వీట్లు చేసిన సినిమాల జాబితాలో 'మాస్టర్' మొదటి ప్లేస్ లో నిలిచింది. తెలుగు నుంచి 'సర్కారు వారి పాట' 'సరిలేరు నీకెవ్వరు' 'పుష్ప' సినిమాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.