రష్మిక మైసా షూటింగ్ అప్డేట్.. పచ్చని ప్రదేశంలో అదిరిపోయే యాక్షన్!
ముఖ్యంగా ఈ సినిమాలోని యాక్షన్స్ సన్నివేశాలను అత్యంత సహజంగా రూపొందించడమే కాకుండా గూస్ బంప్స్ తెప్పించే రేంజ్ లో ఉండాలని డైరెక్టర్ ప్లాన్ చేశారు.;
రష్మిక మందన్న కన్నడ బ్యూటీ అయినప్పటికీ ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్న ఈమె పుష్ప సినిమాతో శ్రీవల్లిగా తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఇక తర్వాత పుష్ప 2, యానిమల్, ఛావా, కుబేర సికందర్, ది గర్ల్ ఫ్రెండ్ అంటూ పలు చిత్రాలు చేసి భారీ పాపులారిటీ అందుకున్న రష్మిక.. కేవలం మూడు సంవత్సరాల వ్యవధిలోనే ఏకంగా మూడువేల కోట్లకు పైగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వసూలు చేసి బాక్సాఫీస్ క్వీన్ గా పేరు సొంతం చేసుకుంది.
ఇక ఈ ఏడాది తన ప్రియుడు ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ తో ఏడడుగులు వేసిన ఈమె.. వివాహం తర్వాత తన సినిమా షూటింగ్ లతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఒకవైపు తన భర్త విజయ్ దేవరకొండ తో కలిసి రణబాలి సినిమా షూటింగ్లో పాల్గొంటూనే.. మరొకవైపు లేడీ ఓరియంటెడ్ మూవీ మైసా లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అప్డేట్ అందరిలో అంచనాలు పెంచేసింది. అందం అభినయంతో ఆకట్టుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు అసలు సిసలైన యాక్షన్ యాంగిల్ ను బయటకు తీస్తోంది. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రష్మిక ఒక గోండు గిరిజన జాతి అమ్మాయిగా నటిస్తోంది. ఈ పాత్ర కోసం గత కొన్నాళ్లుగా ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటుంది రష్మిక.. ఇకపోతే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అప్డేట్ ఫిలిం వర్గాలలో చెక్కర్లు కొడుతోంది.
ముఖ్యంగా ఈ సినిమాలోని యాక్షన్స్ సన్నివేశాలను అత్యంత సహజంగా రూపొందించడమే కాకుండా గూస్ బంప్స్ తెప్పించే రేంజ్ లో ఉండాలని డైరెక్టర్ ప్లాన్ చేశారు. అందుకోసం బ్యాంకాక్ వెళ్లి మరీ ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ ఆండీ లాంగ్ పర్యవేక్షణలో యుద్ధ విద్యల్లో మెళుకువలు కూడా రష్మిక నేర్చుకుంది. ప్రస్తుతం కేరళాలోని అడవుల్లో పచ్చని చెట్ల మధ్య ఈ పోరాట ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ కేచా నేతృత్వంలో 15 రోజులపాటు ఈ భారీ యాక్షన్ షెడ్యూలు జరగనుంది. ఇకపోతే ఈ సినిమాలో రష్మిక గిరిజన అమ్మాయిగా చాలా రా , ఇంటెన్స్ లుక్కులో ఉండబోతుందని తెలుస్తోంది. ఏది ఏమైనా రష్మిక మందన్న మైసా మూవీకి సంబంధించిన ఈ షూటింగ్ అప్డేట్ అంచనాలు భారీగా పెంచేస్తుందని చెప్పవచ్చు.
ఇక రష్మిక విషయానికి వస్తే.. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు తన వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు రెండు సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉంది అలాగే మరోవైపు డైరెక్టర్ వెంకీ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతుందని.. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.