ఆ టాప్ 5 లిస్ట్ లో `వ‌కీల్ సాబ్‌`

Update: 2021-12-09 11:36 GMT
`బాహుబ‌లి` పుణ్య‌మా అని టాలీవుడ్ హీరోల క్రేజ్ నానాటికీ ద‌శ దిశ‌లా మారు మ్రోగిపోతోంది. మ‌న ద‌గ్గ‌ర ఏ సినిమాని ప్ర‌క‌టించినా యావ‌త్ భార‌తీయ సినీ దిగ్గ‌జాలు ఆస‌క్తిగా చూస్తున్నాయి. సోష‌ల్‌మీడియాలోనూ మ‌న‌వారి సినిమాలు ఓ రేంజ్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇదిలా వుంటు ఈ ఏడాది టాప్ 5 మోస్ట్ ట్వీటెడ్ సినిమాల జాబితాలోనూ మ‌న సినిమాలు నిలిచాయి. ఈ జాబితాలోప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన `వ‌కీల్ సాబ్‌` స్థానాన్ని ద‌క్కించుకుంది.

త‌మిళ సూప‌ర్ స్టార్స్ అయిన విజ‌య్‌, అజిత్ చిత్రాలు మొద‌టి రెండు స్థానాల్ని ద‌క్కించుకోగా ప‌వ‌న్ క‌ల్యాణ్ `వ‌కీల్ సాబ్‌` ఐద‌వ స్థానంలో నిలిచింది. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే టాలీవుడ్ నుంచి టాప్ 5లో నిలిచిన ఏకైక చిత్రం ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. మిగ‌తా స్థానాల‌ని త‌మిళ చిత్రాలే ఆక్ర‌మించేశాయి. ఇక 2021లో ఇండియాలో అత్య‌ధికంగా ట్వీట్ చేసిన చిత్రాల జాబితాలో మొట్ట‌మొద‌టి స్థానాన్ని విజ‌య్ న‌టించిన `మాస్ట‌ర్‌` చిత్రం ద‌క్కించుకుంది. రెండ‌వ స్థానంలో అజిత్ న‌టించిన `వాలిమై` నిలిచింది.

అయితే ఈ రెండు చిత్రాల్లో `వాలిమై` ఇంకా విడుద‌ల కాలేదు. కేవ‌లం ప్రోమోతోనే `వాలిమై` ఈ ఫీట్ ని సాధించ‌డం గ‌మ‌నార్హం. అంతే కాకుండా విజ‌య్ న‌టిస్తున్న `బీస్ట్‌` మూడ‌వ స్థానంలో నిలిచింది. ఇక నాలుగ‌వ స్థానాన్ని సూర్య న‌టించిన `జై భీమ్` ఆక్ర‌మించేసింది. ఆ త‌రువాత స్థానాన్ని మ‌న తెలుగు చిత్రం `వ‌కీల్ సాబ్‌` స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది.



Tags:    

Similar News