• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'వడి వడిగా' సాంగ్:...

'వడి వడిగా' సాంగ్: 'ఇందువదన' నుంచి లవ్లీ మెలోడీ..!

By - Tupaki Desk
Update: 2021-07-05 12:30 GMT
వరుణ్ సందేష్ - ఫర్నాజ్ శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ''ఇందువదన''. MSR ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌ పై మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వ‌రుణ్ పోషిస్తున్న వాసు పాత్ర‌కి లుక్.. అలానే ఫ‌ర్నాజ్ శెట్టి ఇందు పాత్రకి సంబంధించిన లుక్ అనూహ్య స్పందన తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి 'వడి వడిగా' అనే సాంగ్ లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

'వడి వడిగా సుడిగాలిలా వచ్చి.. గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా.. సరసర రావే సరాసరి సునామీలా.. చుట్టేసావు హడావుడిగా' అంటూ సాగిన ఈ లవ్లీ మెలోడీ సాంగ్ శ్రోతలను అలరిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ శివ కాకాని దీనికి మంచి ట్యూన్ సమకూర్చారు. తిరుపతి జావన క్యాచీ లిరిక్స్ అందించగా.. సింగర్స్ జావిద్ అలీ - మాళవిక ఆలపించారు. అందమైన లొకేషన్స్ లో తీసిన ఈ పాటలో వరుణ్ సందేశ్ - ఫ‌ర్నాజ్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. దీనికి ఆట సందీప్ కొరియోగ్రఫీ చేశారు.

''ఇందువదన'' చిత్రానికి కథ, మాటలు సతీష్ ఆకేటీ అందించారు. బి. మురళీకృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్య‌త‌లు నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రంలో రఘు బాబు - అలీ - నాగినీడు - సురేఖ వాణి - ధనరాజ్ - తాగుబోతు రమేష్ - మహేష్ విట్ట - పార్వతీషం - వంశీ కృష్ణ ఆకేటి - దువ్వాసి మోహన్ - జ్యోతి - కృతిక - అంబఋషి - ‘జెర్సీ’ మోహన్ తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జరుపుకుంటోంది.

Full View
Tags:    
  • Vadi Vadiga 
  • Lyrical Song 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

Copyright @2026

Powered by Blink CMS