• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టీజ‌ర్ టాక్ : ఇంట్లో...

టీజ‌ర్ టాక్ : ఇంట్లో బుద్ధిమాన్ ..వీధిలో శ‌క్తిమాన్‌!

By - Tupaki Desk
Update: 2022-09-29 11:44 GMT
అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంట‌గా న‌టిస్తున్న రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ `ఊర్వ‌శివో రాక్ష‌సివో`. జీఏ 2 పిక్చ‌ర్స్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ తిరుమ‌ల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ధీర‌జ్ మొగిలినేని ఈ మూవీని నిర్మిస్తున్నారు. క‌ల్యాణ్ దేవ్ తో `విజేత‌` మూవీని రూపొందించిన రాకేష్ శ‌శి ఈ మూవీకి ద‌ర్శ‌కుడు. ABCD మూవీ త‌రువాత శిరీష్ నుంచి మ‌రో సినిమా రాలేదు. త‌న నుంచి సినిమా వ‌చ్చి దాదాపు రెండేళ్ల‌కు పైనే అవుతోంది. ఈ నేప‌థ్యంలో కొత్త సినిమా `ఊర్వ‌శివో రాక్ష‌సివో`తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.

అల్లు శిరీష్‌కు,  శైల‌జా రెడ్డి అల్లుడు, అల్లుడు అదుర్స్‌, మ‌హా స‌ముద్రం వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల‌తో కెరీర్ లో డేంజ‌ర్ స్టేజ్ లో వున్న అను ఇమ్మాన్యుయేల్ కు ఈ మూవీ చాలా కీల‌కంగా మారింది. ముందు `ప్రేమ కాదంట‌` అంటూ హ‌డావిడి చేసిన చిత్ర బృందం ఫైన‌ల్ గా ఈ మూవీ టైటిల్ ని `ఊర్వ‌శివొ రాక్ష‌సివో`గా మార్చేసి రీసెంట్ గా ఫ‌స్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీని న‌వంబ‌ర్ 4న రిలీజ్ చేయ‌బోతున్నారు.  

తాజాగా సినిమా టైటిల్ తో పాటు మేక‌ర్స్ రిలీజ్ డేట్ ని కూడా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీతో మ‌ళ్లీ ట్రాక్ లోకి రావాల‌ని అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్ గ‌ట్టి న‌మ్మ‌కంతో వున్నారు. ఈ సంద‌ర్భంగా గుర‌వారం ఈ మూవీ టీజ‌ర్ ని మేక‌ర్స్ రిలీజ్ చేశారు. `కొన్ని విష‌యాలు మ‌నం ఎంత ట్రై చేసినా జ‌ర‌గ‌వు.. ఒకోసారి అనుకోకుండానే జ‌రిగిపోతాయి. అలాంట‌ప్పుడే అది మ‌ళ్లీ మ‌ళ్లీ జ‌రిగితే బాగుండు అనిపిస్తుంది` అంటూ అల్లు శిరీష్ వాయిస్ తో టీజ‌ర్ మొద‌లైంది.

డైలాగ్ క‌ట్ కాగానే అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్ అనుకోకుండా ద‌గ్గ‌ర‌కావ‌డం.. లిప్ లాకుల్లో మునిగిపోవ‌డం.. ఆ త‌రువాత ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డ‌టం.. నువ్వు మామూలోడికి కాదు రాజా ఇంట్లో బుద్దిమాన్ ..వీధిలో శ‌క్తిమాన్‌.. అంటూ పోసాని అంటున్న తీరు.. శిరీష్ ల‌స్ట్ స్టోరీ గురించి తెలుసుకున్న వెన్నెల కిషోర్ `అమ్మ‌నా ఆల్ట్ బాలాజీ నువ్వేంట్రా మ‌నీ హైస్ట్ లో ప్రొఫెస‌ర్ లా ఇంత ప్లానింగ్ తో వున్నావు` అంటూ అదిరిపోయే పంచ్ వేయ‌డం..

ఆ త‌రువాత అల్లు శిరీష్‌, అను శారీర‌కంగా క‌లిసి పోవ‌డం.. ఆ త‌రువాత నేను ల‌వ్ చేస్తున్నాన‌ని శిరీష్ అంటే .. నేను జ‌స్ట్ ఫ్రెండ్షిప్ మాత్ర‌మే చేశాన‌ని అను అన‌డం.. ఎండింగ్ లో సునీల్ .. అల్లుడూ ఇది కొంచెం ట‌ఫ్ మ్యాచ్ రా.. కేర్ ఫుల్ గా ఆడు` అంటూ చివ‌రి పంచ్ వేయ‌డం న‌వ్వులు పూయిస్తోంది. ఓవ‌రాల్ గా శిరీష్ ఈ సారి హాట్ టాపిక్ కావాల‌నే కాస్త ఘాటు కంటెంట్ తో యూత్ ని మెల్ట్ చేసే సీన్ ల‌తో వ‌స్తున్న‌ట్టుగా తెలుస్తోంది. టీజ‌ర్ చూసిన వాళ్లంతా హిట్ కోసం ఈ సారి అల్లు శిరీష్‌..అను ర‌చ్చ లేప‌బోతున్న‌ట్టుగా వున్నారుగా అని కామెంట్ లు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    
  • UrvasivoRakshasivo 
  • Teaser 
  • AlluSirish 
  • AnuEmmanuel 
  • RakeshSashii 
  • latestnews 

Similar News

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS