ఆద‌మ‌రిస్తే అంతేగా.. ఎవ‌రీ మిల్కీ బ్యూటీ 2..?

Update: 2022-04-20 03:30 GMT
సోష‌ల్ మీడియా యుగంలో ఎప్పుడు ఎవ‌రి టైమ్ ఎలా న‌డుస్తుందో గెస్ చేయ‌లేని ప‌రిస్థితి. అస‌లు అప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రో తెలియ‌ని వాళ్లు కూడా అంత‌లోనే ప్ర‌జ‌ల్లోకి దూసుకెళ్లిపోతున్నారు. ఏదో ఒక వివాదంతో అంట కాగి లేదా ఏదో  ఒక ర‌కంగా అగ్గి రాజేసి .. ఫోటోషూట్ల‌తో మంట‌లు పుట్టించి ఏదోలా వైర‌ల్ అయిపోతున్నారు. ఇదే కోవ‌కు చెందుతుంది మోడ‌ల్ కం న‌టి ఉర్ఫీ జాద‌వ్.

ఉర్ఫీ అంటే ఎవ‌రో సామాజిక మాధ్య‌మాల్ని అనుస‌రించేవారికి చెప్పాల్సిన ప‌నే లేదు. ఇక్క‌డ నిరంత‌రం వీనుల‌విందైన ప‌సందైన వంట‌కాల్ని రెడీ చేసి అందిస్తోంది ఉర్ఫీ. వ‌రుస‌గా బికినీల‌తోనో లేదా చీర క‌ట్టులోనో అందాలు ఆర‌బోస్తూ ఉర్ఫీ చేస్తున్న సంద‌డి అంతా ఇంతా కాదు.

ఉర్ఫీ జావేద్ ఒక భారతీయ టెలివిజన్ నటి. ఆమె బడే భయ్యా కి దుల్హనియాలో అవనీగా.. మేరీ దుర్గాలో ఆర్తి గా .. బేపన్నాలో బెల్లా గా న‌టించింది. ALT బాలాజీలో ప్రసారమైన `పంచ్ బీట్ సీజన్ 2`లో మీరా పాత్రను పోషించి మ‌రింత పాపుల‌రైంది.  ఆమె బిగ్ బాస్ OTT సీజన్ 1లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొంది.

ఉర్ఫీ జావేద్ పూర్తి స్థాయి లెస్బియన్ సన్నివేశాన్ని ప్రదర్శించవలసి వచ్చినప్పుడు.. నేను మంచం మీద ఏడుస్తూ బెగ్ చేశాన‌ని కూడా తెలిపింది. ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ OTT ఫేమ్ ఉర్ఫీ జావేద్ ఒకసారి తన కష్టతరమైన ఆరంభ‌ రోజుల నుండి ఒక భయంకరమైన సంఘటనను గుర్తుచేసుకుంది. ఒక ద‌ర్శ‌క‌నిర్మాత తన‌ను పూర్తి స్థాయి లెస్బియన్ సన్నివేశంలో న‌టించ‌మ‌ని కోరార‌ట‌.

కానీ దానికి ఏడ్చేశాన‌ని కూడా తెలిపింది. అయితే ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో రెచ్చిపోతున్న ఈ బ్యూటీకి ఎలాంటి యాక్ట్ అయినా పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. ఇక సామాజిక మాధ్య‌మాల్లో అమాతం ఫాలోయింగ్ పెర‌గ‌డంతో ర‌మ్మీల‌కు కోలాల‌కు కూడా ప్ర‌చారం చేసేస్తూ బాగానే ఆర్జిస్తోంది. ఆదాయం ఏ రూపంలో వ‌చ్చినా ఫ‌ర్వాలేదు.. త‌న‌కు వ‌ర్క‌వుట్ కావాలి! అంతే అన్న చందంగా ఉంద‌ని విమ‌ర్శ‌లొస్తున్నాయి.

ఉర్ఫీ ఇంత‌కుముందు తాడుతో స్వింగ్ ఆడుతూ ఉన్న వీడియోని షేర్ చేయ‌గా అభిమానులు త‌న చీర లుక్ ని త‌ప్పు ప‌ట్టారు. ఇలాంటి వేషాలు వేయొద్ద‌ని కూడా సెల‌విచ్చారు. ఉర్ఫీ షేర్ చేసిన తాజా ఫోటోగ్రాఫ్ లో మిల్కీ వైట్ నిగ‌నిగ‌ల‌తో త‌ళుక్కున మెరిసిపోయింది. ఆద‌మ‌రిస్తే అంతేగా.. ఎవ‌రీ మిల్కీ బ్యూటీ 2..? అంటూ కామెంట్లు ప‌డిపోతున్నాయ్.
Tags:    

Similar News