మిడిల్ ఈస్ట్ కి హేట్ స్టోరి బ్యూటీ గ్లామ‌ర్ ట్రీట్

Update: 2020-11-17 16:30 GMT
వేడెక్కించే హాట్ ఫోటోషూట్ల‌తో చెల‌రేగ‌డం హేట్ స్టోరి 4 బ్యూటీ ఊర్వ‌శి రౌతేలాకు కొత్తేమీ కాదు. ఇటీవ‌ల ప‌లు సంద‌ర్భాల్లో బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్ కి సంబంధించిన హాట్ ఫోటోల్ని ఇన్ స్టాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు అంత‌ర్జాలాన్ని షేక్ చేశాయి.

అలాగే జిమ్ వీడియోలు ఫోటోలు ఇంట‌ర్నెట్ లో ట్రెండింగ్ అయ్యాయి. తాజాగా మ‌రోసారి ఊర్వ‌శి త‌న‌దైన శైలిలో రెచ్చిపోయింది. యుఏఇకి చెందిన ప్ర‌ఖ్యాత XPEDITION మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ కోసం ఊర్వశి రౌతేలా ఇచ్చిన ఫోజులు ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.

ప్రత్యేక దీపావళి సంచిక ముఖచిత్రంగా ఊర్వ‌శి అంద‌చందాలు హీటెక్కిస్తున్నాయి. ఆమె అద్భుతమైన శైలి.. అందమైన రూపం.. మైమ‌రిపిస్తోంది. భారతదేశాన్ని మధ్యప్రాచ్యానికి సువిశాల‌ ప్రపంచానికి ప్రకాశింపజేస్తున్న హాటెస్ట్ బ్యూటీగా రౌతేలా పాపుల‌ర‌వుతోంది.

ఈ ఫోటోషూట్ లో దేనిక‌దే ప్ర‌త్యేకం. ఓ ఫోటోలో బ‌ర్డ్ క్వీన్ గా ఫెద‌ర్ డిజైన్ తో క‌నిపించిన ఊర్వ‌శి వేరొక ఫోటోలో క్రిస్ట‌ల్స్ తో డిజైన్ చేసిన స్పెష‌ల్ డిజైన‌ర్ వేర్ లో అద‌ర‌గొట్టేసింది. ఈ ఫోటోషూట్ కోసం వ‌ర‌ల్డ్ క్లాస్ టెక్నీషియ‌న్లు ప‌ని చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ ..ఆర్ట్ డైరెక్టర్ లు టాప్ క్లాస్.. అలాగే ఆర్ట్ ఎడిటర్ E2 స్క్వేర్డ్ ఫోటోగ్రఫి.. విమిజోషి మేక‌ప్ .. మాకోస్మెటిక్స్మిడిల్ ఈస్ట్..  మాంగెమోంగ్ వీడియోగ్రఫీ అంటూ త‌న బృందాన్ని ఊర్వ‌శి ప‌రిచ‌యం చేసింది. ఊర్వ‌శి ప్ర‌స్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది. సౌత్ లోనూ బిజీ నాయిక కావాల‌ని క‌ల‌లు కంటోంది. టాలీవుడ్ టాప్ హీరోలు చ‌ర‌ణ్ .. బ‌న్ని వంటి స్టార్ల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకోనుంద‌ని ఇటీవ‌ల గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News