ఉప్పెన వర్సెస్‌ నిశబ్దం ఏది పైచేయి

Update: 2020-03-11 07:26 GMT
మరికొన్ని రోజుల్లో సినిమాలకు సమ్మర్‌ సీజన్‌ ప్రారంభం కాబోతుంది. సంక్రాంతి తర్వాత ఆశించిన స్థాయిలో మంచి సినిమాలు రాలేదు. ఒకటి రెండు పర్వాలేదు అనిపించినా కూడా ఎక్కువ శాతం ప్రేక్షకులు సమ్మర్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ చిత్రాల కోసం ఎదురు చూస్తున్నారు. మార్చి 25 నుండి సమ్మర్‌ సినిమాల సందడి కొనసాగబోతుంది. ఏప్రిల్‌ 2న మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ‘ఉప్పెన’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే తేదీన సుదీర్ఘ కాలం తర్వాత అనుష్క ‘నిశబ్దం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది.

ఈ రెండు సినిమాల మద్య టఫ్‌ ఫైట్‌ ఉండేలా కనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనుష్క స్టార్‌ డం ముందు వైష్ణవ్‌ తేజ్‌ నిలవలేడంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని నిశబ్దం ఇప్పటి వరకు ప్రేక్షకుల్లో బజ్‌ ను క్రియేట్‌ చేయడంలో సఫలం కాలేదు. ఇటీవల విడుదలైన టీజర్‌ నిరాశ పర్చింది. మరో భాగమతిలా ఉంటుందా అంటూ నెగటివ్‌ కామెంట్స్‌ ను దక్కించుకుంది. ఇక కొత్త వాడైనా కూడా వైష్ణవ్‌ తేజ్‌ ఉప్పెన సినిమా పై యూత్‌ ఆడియన్స్‌ లో పాజిటివ్‌ వైబ్స్‌ ఉన్నాయి.

ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మరియు టీజర్‌ సినిమాపై ఆసక్తిని కలిగించడం లో సక్సెస్‌ అయ్యాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి విడుదల సమయం వరకు కంటిన్యూ అయితే నిశబ్దం కంటే ఉప్పెనకే ఎక్కువ ఓపెనింగ్స్‌ సాధ్యం అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. పైగా వైష్ణవ్‌ మెగా కార్డ్‌ ను ఉపయోగించుకుని ఓపెనింగ్స్‌ ను రాబట్టుకునే అవకాశం ఉందంటున్నారు.

నిశబ్దం సినిమా గురించి పబ్లిసిటీ ఎక్కువ చేస్తే తప్ప ఉప్పెన ముందు నిలిచే అవకాశం లేదని అంటున్నారు. విడుదల తర్వాత మాత్రం ఏ సినిమా కంటెంట్‌ బాగుంటే.. ఏ సినిమా ఎంటర్‌ టైన్‌ మెంట్‌ అనుకుంటే ఆ సినిమాకు ప్రేక్షకులు క్యూ కట్టే అవకాశం ఉంది. విడుదల ముందు మాత్రం రెండు సినిమాల మద్య టఫ్‌ ఫైట్‌ అయితే కనిపిస్తుంది.
Tags:    

Similar News