టైగర్ నాగేశ్వరరావు.. వచ్చేది ఎప్పుడంటే?

Update: 2023-03-29 13:05 GMT
మాస్ మహారాజా రవితేజ వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉన్నాడు. గత ఏడాది డిసెంబర్‌లో ధమాకా సూపర్ హిట్ కావడంతో రవితేజ చేస్తున్న సినిమాల మీద ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమా వచ్చేనెల మొదట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నాడు. ఇప్పుడు ఆసక్తికరంగా రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ కూడా ప్రకటించింది సినిమా యూనిట్. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవ్వబోతోంది.

వంశీ దర్శకత్వంలో ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ మీద అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వంటి సినిమాల తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద నార్త్ బెల్ట్ లో కూడా మంచి ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు రవితేజ కెరియర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించినట్టు ముందు నుంచి ప్రచారం జరుగుతుంది.

ఈ సినిమాలో రవితేజ స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఏకంగా ఒక ఐదు ఎకరాల భూమిలో స్టువర్టుపురం అనే గ్రామాన్ని నిర్మించింది ఈ సినిమా యూనిట్.

ఇక ఈ సినిమా అక్టోబర్ 21 తేదీన దసరా సందర్భంగా రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించడంతో సంక్రాంతి తర్వాత అతి పెద్ద సీజన్ అయిన దసరాతో రవితేజ మరో బ్లాక్ బస్టర్ అందుకుంటాడని అందరూ భావిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో రవితేజ సరసన గాయత్రీ భరద్వాజ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక  ఈ సినిమా మీద ప్రేక్షకులకు మరింత ఆసక్తి పెరుగుతోంది.           


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News