సమంతకు హార్ట్ టచింగ్ గిఫ్ట్ పంపిన ఉపాసన

Update: 2020-10-19 15:00 GMT
హీరోయిన్ సమంత, హీరో రాంచరణ్ భార్య ఉపాసన ఈ మధ్య చాలా క్లోజ్ గా ఉంటున్నారు. వారిద్దరూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఇటీవల కొన్ని ఆరోగ్య కార్యక్రమాల కోసం ఒకరితో ఒకరు సహకరించుకున్నారు. కొన్ని ఫుడ్, చిట్కాలకు సంబంధించిన వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. దీంతో వీరి మధ్య స్నేహ బంధం బలపడింది.

ఈ క్రమంలోనే సమంతకు తాజాగా ఉపాసన ఓ మంచి గిఫ్ట్ పంపింది. ఈ మేరకు సమంతా ఈ ఉదయం తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీటిని అభిమానులకు పంచుకుంది. తనకు.. తన పెంపుడు కుక్క హాష్ కోసం ఉపసనా ప్రత్యేక బహుమతులను పంపినట్టు ఒక వీడియోను సమంత షేర్ చేసింది. ‘హష్‌ ప్రౌడ్‌ మామ్‌, ప్రౌడ్‌ సన్‌ ఆఫ్‌ సామ్‌..’ అంటూ బ్రాస్లెట్‌, లాకెట్‌ ను ఉపాసన బహుమతిగా పంపిందంటూ వాటిని చూపిస్తూ తీసిన వీడియోను సామ్‌ షేర్‌ చేశారు.

“నేను దీన్ని ఎలా జాగ్రత్తగా విలువైనది దాచుకుంటారు. నాపై ఇంత ప్రేమను చూపించిన ప్రియమైన వ్యక్తి నువ్వు”అంటూ ఉపాసనకు సమంతా పోస్టులో కృతజ్ఞతలు తెలిపింది.
Tags:    

Similar News