జేపీ ముక్కు సర్జరీ సగమే అయ్యిందట

Update: 2020-09-10 03:45 GMT
విలన్‌ గా కమెడియన్‌ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన నటుడు జేపీ మంగళవారం ఉదయం గుండె పోటుతో మృతి చెందిన విషయం తెల్సిందే. ఆయన మృతి చెందిన తర్వాత ఆయనకు సంబంధించిన పలు విషయాలు సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ అవుతున్నాయి. గతంలో ఆయన ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలు ఇప్పుడు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఆ వీడియోలు మరియు ఫొటోలతో జేపీని సినీ జనాలు మరియు ప్రేక్షకులు గుర్తు చేసుకుంటున్నారు. జేపీ ముక్క విషయంలో గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడటం జరిగింది. ముక్కుపై ఉండే కాటుకు సంబంధించి చాలా మంది చాలా రకాలుగా అనుకునేవారు. దానికి జేపీ ఆ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.

కెరీర్‌ ఆరంభంలో జేపీ విలన్‌ పాత్రలు ఎక్కువగా చేశాడు. ఆ సమయంలో ఆయన మొహం గంభీరంగా ఉండటంతో పాటు ముక్కుపై మచ్చ ఉండటంతో నిజంగానే ఆయన రౌడీ గ్యాంగ్‌ నుండి వచ్చాడా అన్నట్లుగా ఉండేవారు. ఆ విషయంలో జేపీ మాట్లాడుతూ చిన్నప్పటి నుండి నాది చప్పిడి ముక్కు. దాన్ని సరి చేసుకునేందుకు నేను ఎప్పుడు ప్రయత్నించలేదు. కాని ఒక మిత్రుడు బలవంతంతో కేరళలోని ఒక వైధ్యుడి వద్ద ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నాడట.

మొత్తం మూడు సిట్టింగ్స్‌ లో ఆపరేషన్‌ చేయాల్సి ఉంది. మొదటి సిట్టింగ్‌ పూర్తి అయిన తర్వాత ఆరు నెలల తర్వాత మళ్లీ సర్జరీకి వెళ్లాల్సి ఉంది. మొదటి సర్జరీ తర్వాత ముక్కుపై గాటు పడ్డట్లుగా అయ్యింది. రెండవ సిట్టింగ్‌ లో ఆ గాటు పోతుందన్నారు. కాని రెండవ సిట్టింగ్‌ కు ఆలస్యం అయ్యింది. అంతలో ఆ డాక్టర్‌ యాక్సిడెంట్‌ లో మృతి చెందడంతో రెండవ సర్జరీ జరగలేదు. అందువల్ల ముక్కుపై మచ్చ అలాగే ఉండి పోయిందని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News