డెకాయిట్ ఇంట‌ర్వెల్ అంచ‌నాల‌ను మించి ఉంటుంది

ఇంటర్వెల్ బ్యాంగ్‌పై వచ్చిన ప్రశ్నకు శేష్ ఇచ్చిన సమాధానం కూడా అంచనాలను పెంచేదిగా ఉంది.;

Update: 2026-04-09 14:00 GMT

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన డెకాయిట్ సినిమా విడుదలకు గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉండగా, చిత్రంపై ఆసక్తి మరింత పెరుగుతోంది. షానియెల్ డియో దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించిన శేష్, ప్రమోషన్స్‌లో భాగంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.

ఈ ఇంటరాక్షన్‌లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు శేష్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. డెకాయిట్ సినిమా తన గత సినిమా క్ష‌ణం తరహాలో ఉంటుందా? అనే ప్రశ్నకు స్పందిస్తూ, సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు సర్‌ప్రైజ్ అవురని చెప్పి సస్పెన్స్ క్రియేట్ చేశాడు. అలాగే తన సినిమాల్లో ట్విస్టులు తప్పనిసరి అనేది ప్రేక్షకుల అభిప్రాయం కాగా, ఈసారి మాత్రం డెకాయిట్ ఒక ప్రేమకథగా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని, ఈ సినిమాతో మీరు లవ్‌లో పడతారు అని హామీ ఇచ్చాడు.

ఇంటర్వెల్ బ్యాంగ్‌పై వచ్చిన ప్రశ్నకు శేష్ ఇచ్చిన సమాధానం కూడా అంచనాలను పెంచేదిగా ఉంది. డెకాయిట్ ఇంట‌ర్వెల్ మీ అంచనాలను మించిపోతుంద‌ని, ఆ సీన్ ఒక ప్రత్యేకమైన ఫీల్ ఇస్తుంద‌ని చెప్పడంతో ఆ సీక్వెన్స్‌పై హైప్ పెరిగింది. ఇక తన గత సినిమాలు హిందీలో రిలీజ్ కాలేదని, అందుకే ఈసారి ఉత్తరాది ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా హిందీలో షూట్ చేశామని వెల్లడించాడు.

సహనటి మృణాల్ ఠాకూర్ గురించి మాట్లాడిన శేష్, బంగారం మ‌రియు ప్లాటినం కలిపితే మృణాల్ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమాలో ఆమె పాత్ర కీలకమని కూడా శేష్ ఈ సంద‌ర్భంగా స్పష్టం చేశాడు. ఇక సినిమాలోని కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చెబుతూ, ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ సీన్స్‌తో పాటు చివరి 23 నిమిషాలు తనకు బాగా న‌చ్చాయ‌ని వెల్లడించాడు.

సినిమాలో కన్నెపెట్టరో కన్నుకొట్టరో పాట కీలక సన్నివేశంలో వస్తుందని, అలాగే సింగర్ జోనితా గాంధీతో కలిసి చిచ్చుబుడ్డి పాటలో మొదటిసారి డ్యాన్స్ చేసిన అనుభవాన్ని కూడా పంచుకున్నాడు. వ్యక్తిగతంగా తనకు హైదరాబాద్, ల‌ఖ్‌న‌వూ బిర్యానీల కంటే అమ్మ చేతి వంటనే ఎక్కువ ఇష్టమని చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది. మొత్తానికి, డెకాయిట్ పై శేష్ ఇచ్చిన హింట్స్ చూస్తే, ఈ సినిమా కేవలం సస్పెన్స్ మాత్రమే కాకుండా ఎమోష‌న్స్ తో కూడిన ప్రేమకథగా ప్రేక్షకులను అలరించేలా కనిపిస్తోంది.

Tags:    

Similar News