200 కోట్ల స్కామ్: ముక్కోణ‌ ప్రేమ క‌థ‌లో ఎన్ని మ‌లుపులు?

Update: 2023-01-25 12:00 GMT
200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో తన పేరును అన్యాయంగా లాగి తన పరువు తీశారంటూ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పై నటి నోరా ఫతేహి దాఖలు చేసిన క్రిమినల్ ఫిర్యాదును ఢిల్లీ కోర్టు మార్చి 25న విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. కెనడా పౌరురాలు అయిన నోరా ఫతేహి తన ఫిర్యాదులో 15 మీడియా సంస్థలను కూడా నిందితులుగా చేర్చారు.

న్యాయ శిక్షణ నిమిత్తం న్యాయమూర్తి సెలవులో ఉన్నందున గ‌త‌ శనివారం విచారణకు రావాల్సిన ఈ అంశం వాయిదా పడినట్లు ఫతేహి తరపు న్యాయవాది తెలిపారు. Ms. ఫతేహి తన ఫిర్యాదులో వేగంగా దూసుకెళుతున్న కెరీర్ తో పాటు తనకు సహజమైన ఖ్యాతి ప‌రిశ్ర‌మ‌లో ఉంది..పోటీ పడలేని ప్రత్యర్థులు బెదిరిపోయార‌ని కూడా నోరా ఈ ఫిర్యాదులో పేర్కొంది. చెడు న‌మ్మ‌కం.. ద్వేషపూరిత ఉద్దేశ్యంతో త‌న‌కు పరువు నష్టం కలిగించే ప్రకటన చేశారని పరువు తీసే ఉద్దేశ్యంతోనే మీడియా సంస్థలు ఈ  వార్త‌ల‌ను ప్రసారం చేశాయని నోరా అన్నారు. నోరా కాన్ మాన్ చంద్రశేఖర్ నుండి బహుమతులు పొందారని బాలీవుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్ చేసిన ఆరోపణలు తప్పు అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

చెన్నైలో జరిగిన ఒక‌ కార్యక్రమంలో ఫిర్యాదుదారు(నోరా)ని లీనా స్వ‌యంగా ఆహ్వానించిన కార్యక్రమంలో లీనా మారియా స్పీకర్ ఫోన్ లో చంద్రశేఖర్ తో మాట్లాడించార‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిర్యాదుదారు(నోరా)కి లీనా ఒక ఐఫోన్ - గూచీ బ్యాగ్ ను బహుమతిగా అందించింది. చంద్రశేఖర్ నుంచి త‌న‌కు ఎలాంటి బహుమతులు అందలేదు'' అని ఫతేహి ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీమతి ఫతేహి కూడా తాను చంద్రశేఖర్ నుండి లగ్జరీ కారును పొందలేదని.. అది తన బావమరిది బాబీ ఖాన్ కు పార్ట్ పేమెంట్ అని చెప్పింది. చంద్రశేఖర్ న‌న్ను ఓ సినిమాకి దర్శకత్వం వహించడానికి సంప్రదించాడని కూడా నోరా తెలిపింది. ఫిర్యాదుదారు(నోరా) చంద్రశేఖర్ ని కలిసినంత మాత్రాన అతనితో ఎప్పుడూ మాట్లాడలేదు కాబట్టి జాక్విలిన్ ఫెర్నాండెజ్ చేసిన  ఆరోపణలు స‌రికాదు. మీడియా సంస్థలు దానిని ప్రచురించడం స‌రికాదు'' అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మనీలాండరింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఫెర్నాండెజ్ కు కోర్టు నవంబర్ 15న బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆమెను అరెస్టు చేయలేదు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను కోర్టు ఆగస్టు 31న పరిగణనలోకి తీసుకుంది. ఫెర్నాండెజ్ ను తన ముందు హాజరుకావాలని కోర్టు కోరింది. విచారణకు సంబంధించి ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేయ‌డ‌మే గాక‌ ఫెర్నాండెజ్ ను సప్లిమెంటరీ చార్జిషీట్ లో నిందితురాలిగా చేర్చారు.

ఇక‌పోతే సుకేశ్ చంద్రశేఖర్ తనకు ఇల్లు ఇస్తానని హామీ ఇచ్చాడని నోరా ఫతేహి ఆరోపించిన తర్వాత సుకేష్ చంద్రశేఖర్ మీడియా ప్రకటనలో నోరాపై ఎటాక్ చేసారు. ఈ రోజు ఆమె (నోరా)కు ఇల్లు ఇస్తానని నేను వాగ్దానం చేసిన‌ట్టు నా గురించి మాట్లాడుతోంది. అయితే మొరాకోలోని కాసాబ్లాంకాలో తన కుటుంబానికి ఇల్లు కొనడానికి ఆమె ఇప్పటికే నా నుండి పెద్ద మొత్తం తీసుకుంది. ఈ కొత్త కథలన్నీ చట్టం నుండి తప్పించుకోవడానికి ఆమె రూపొందించినవి. 9 నెలల క్రితం ED కి ఆమె స్టేట్ మెంట్ ఇచ్చాక ఈ కొత్త డ్రామాను తెర‌పైకి తెచ్చింద‌ని సుకేష్ ఎదురు తిరిగారు.
4

జాక్వెలిన్ తో త‌న సీరియ‌స్ సంబంధం చూసి నోరా ఫతేహి ఎప్పుడూ అసూయపడేదని కూడా సుకేష్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. నోరా తనకు కారు అక్కర్లేదని లేదా ఆమె దానిని తన కోసం తీసుకోలేదని వాదించడం చాలా పెద్ద అబద్ధం అని కూడా అన్నారు. నోరాకు BMW S సిరీస్ కార్ ని తాను కొనిచ్చాన‌ని తెలిపారు. 200 కోట్ల మ‌నీలాండ‌రింగ్ కేసులో వివాదాస్ప‌దులైన‌ ముగ్గురి న‌డుమా ముక్కోణ ప్రేమ‌క‌థ గురించి మీడియాలు వ‌రుస క‌థ‌నాలు అల్లుతున్నాయి. అస‌లు ఆ ముగ్గురి నడుమా ఏం జ‌రిగింద‌న్న‌ది కోర్టు విచార‌ణ‌లో తేలాల్సి ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News