'ఆ ఒక్కటి అడక్కు' సెన్సార్ రిపోర్ట్.. ఇది మ్యాటర్!

అల్లరి నరేష్ అనగానే అందరికీ కూడా కామెడీ సినిమాలో ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటాయి

Update: 2024-04-30 05:44 GMT

అల్లరి నరేష్ అనగానే అందరికీ కూడా కామెడీ సినిమాలో ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటాయి. తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న ఈ నటుడు అప్పుడప్పుడు కొన్ని ప్రయోగాలు కూడా చేస్తూ ఉన్నాడు. ఇక చాలా కాలం తర్వాత ఆ ఒక్కటి అడక్కు అంటూ ఒక డిఫరెంట్ కామెడీ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు మొదటి నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి.

పోస్టర్స్ సాంగ్స్ అలాగే టీజర్ ట్రైలర్ కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ఇక ఇప్పుడు మొత్తానికి సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమవుతోంది. చిలక ప్రొడక్షన్స్‌పై రాజీవ్ చిలక నిర్మించిన ఈ సినిమాకు మల్లి అంకం దర్శకత్వం వహించాడు. ఇక అల్లరి నరేష్ సరసన ఫారియా అబ్దుల్లా కథానాయికగా నటించారు.

ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందింది. ఆ ఒక్కటి అడక్కు ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రానుందని ట్రైలర్ తోనే క్లారిటీ వచ్చేసింది. ఈ వేసవిలో థియేటర్లలో నవ్వుల హంగామా సృష్టించబోతోంది. సినిమా 2:14 గంటల పర్ఫెక్ట్ రన్‌టైమ్ తో రాబోతోంది. ఎక్కడ బోర్ కొట్టించకుండా సినిమాను తెరపైకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఆ ఒక్కటి అడక్కు యూనివర్సల్ పాయింట్ యూత్ కి కనెక్ట్ అవుతుందని ట్రైలర్ లోని డైలాగ్స్ తో క్లారిటీ వచ్చేసింది. ఇందులో అల్లరి నరేష్ పెళ్లి చేసుకోవడానికి కష్టపడే రిజిస్ట్రార్‌ గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్‌గా కనిపించనున్నారు. ఇక ఫరియా సిద్ది పాత్రలో కనిపించనుంది. వీరి కెమిస్ట్రీ పర్ఫెక్ఫ్ గా సెట్టయినట్లు తెలుస్తోంది.

Read more!

ఫస్ట్ హాఫ్‌లో పెళ్లి చూపులు సీన్, మ్యారేజ్ రిసెప్షన్ సీన్, అల్లరి నరేష్, వెన్నెల కిషోర్‌లతో మ్యారేజ్ బ్యూరో సీన్, జామీ లీవర్ పెర్ఫార్మెన్స్, స్వయంవర్ సాంగ్ బెస్ట్ పార్ట్‌గా ఉంటాయని తెలుస్తోంది, ఇందులో వైవా హర్ష కామెడీ ఎపిసోడ్స్, షకలక శంకర్ సీన్స్ కూడా మరింతగా ఆకట్టుకోబోతున్నట్లు చెబుతున్నారు.

హీరో, హీరోయిన్, మురళీ శర్మ, గౌతమి కాంబినేషన్ లో వచ్చే సన్నివేశం ద్వితీయార్థంలో హైలైట్‌గా ఉంటుందని సమాచారం. చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ చేసాడు. ఇక అతనిని హాస్యభరితమైన పాత్రలో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News