హైద‌రాబాద్ లో టీవీ న‌టి మిస్!

Update: 2019-06-26 11:21 GMT
ఇటీవ‌ల కాలంలో మిస్సింగ్ కేసుల వ్య‌వ‌హారం తీవ్ర క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో నిత్యం ప‌లువురు మిస్ అవుతున్న ప‌రిస్థితి. వీరంతా నిజంగానే మిస్ అవుతున్నారా?  వేరే కార‌ణాల‌తో వెళ్లిపోయిన వారు మిస్సింగ్ కేసులు న‌మోదు చేస్తున్నారా? అన్న దానిపై క‌న్ఫ్యూజ‌న్ ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక టీవీ న‌టి మిస్ అయిన ఉదంతం సంచ‌ల‌నంగా మారింది.

వారం క్రితం అమీర్ పేట‌లోని ఒక హాస్ట‌ల్ లో ఉంటున్న టీవీ న‌టి ల‌లిత మిస్ అయిన ఉదంతాన్ని గుర్తించారు. అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రానికి చెందిన ల‌లిత ప‌లు టీవీ సీరియ‌ల్స్ లో నటిస్తూ ఉంటుంది. ఈ నెల 11న ఆమె పేరెంట్స్ ఆమెకు ఫోన్ చేశారు. ఫోన్ స్విచాఫ్ చేసి ఉండ‌టంతో ప‌లు విధాలుగా ప్ర‌య‌త్నించారు. తాజాగా హైద‌రాబాద్ కు వ‌చ్చిన ఆమె పేరెంట్స్  ఆరా తీయ‌గా.. ఎవ‌రో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి వ‌చ్చార‌ని.. అత‌డి వెంట వెళ్లిన విష‌యాన్ని హాస్ట‌ల్ కు చెందిన వారు చెబుతున్న‌ట్లు తెలిసింది.

ల‌లిత న‌టిస్తున్న సీరియ‌ల్స్ ప‌లు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌వుతున్నాయి. ఇదిలా ఉంటే బ‌న్నీ అనే వ్య‌క్తి ల‌లిత‌ను త‌న వెంట తీసుకెళ్లిన‌ట్లుగా అనుమానిస్తున్నారు. దీంతో.. ఎస్ ఆర్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్లో ల‌లిత త‌ల్లిదండ్రులు త‌మ కుమార్తె మిస్సింగ్ విషయంపై ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.


Tags:    

Similar News