చిరు సార్..బ్రూస్ లీ ని వాయిదా వేయించండి!

Update: 2015-10-09 10:41 GMT
తుమ్మలపల్లి రామసత్యనారాయణ.. రాంగోపాల్ వర్మతో ‘ఐస్ క్రీమ్’ సిరీస్ తో పాటు కొన్ని చిన్న సినిమాలు నిర్మించిన సీనియర్ నిర్మాత. ఈయనకు, ‘రుద్రమదేవి’ సినిమాకు ఏ సంబంధం లేదు.  అయినప్పటికీ గుణశేఖర్ కష్టం చూసి ఆ సినిమా బాగా ఆడాలని కోరుకుంటూ తన వంతుగా ఏదైనా చేయాలని ముందుకొచ్చారు రామసత్యనారాయణ. ‘రుద్రమదేవి’ని గట్టెక్కించడానికి మెగాస్టార్ చిరంజీవి సాయం కోరుతూ బహిరంగ లేఖ రాశాడీ నిర్మాత.

గుణశేఖర్ మూడేళ్ల కష్టపడి.. ఎన్నో ఇబ్బందుల్ని అధిగమించి.. విడుదల విషయంలో ఎదురుదెబ్బల్ని తట్టుకుని.. ఎట్టకేలకు ‘రుద్రమదేవి’ని రిలీజ్ చేశాడని.. రూ.70 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పెట్టుబడి రాబట్టుకోవాలంటే కనీసం మూడు, నాలుగు వారాలు బాక్సాఫీస్ దగ్గర ఖాళీ ఉండాలని.. ‘బాహుబలి’ కోసం మహేష్ తన ‘శ్రీమంతుడు’ సినిమాను వాయిదా వేసినట్లే.. ‘బ్రూస్ లీ’ని వాయిదా వేసేలా చూడాలని విజ్నప్తి చేశాడు రామసత్యనారాయణ.

‘రుద్రమదేవి’లో మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ ప్రత్యేక పాత్ర పోషించాడని.. అంతే కాక స్వయంగా మీరు వాయిస్ ఓవర్ కూడా అందించారని గుర్తు చేస్తూ చిరంజీవిని ‘బ్రూస్ లీ’ వాయిదా కోసం విజ్నప్తి చేశాడాయన. చిరు స్పందిస్తాడో లేదో కానీ.. తనకు సంబంధం లేని సినిమా మంచి కోరుతూ ఇలా ఓ నిర్మాత లేఖ రాయడం మాత్రం గొప్ప విషయం.
Tags:    

Similar News