సిరివెన్నెల ఇంట్లోనే త్రివిక్రమ్ పెళ్లిచూపులు జరిగాయట!
సిరివెన్నెల పాటలంటే తనకి చాలా ఇష్టమనీ, ఆయన పాటల్లోని పదాలు కొన్ని అర్థం కాకపోతే డిక్షనరీలో వెతికేవాడినని త్రివిక్రమ్ చాలా సందర్భాల్లో చెప్పారు. ట్యూన్ లో పదాలను ఇరికించినట్టుగా కాకుండా, స్వేచ్ఛతో కూడిన పదాలనే సమర్పించడం సిరివెన్నెల ప్రత్యేకతని ఆయన అన్నారు. సిరివెన్నెల పాటల్లోని పదాల అమరికా .. ఆ పదాల్లోని భావాల లోతులను చూసి తాను ఆయన అభిమానినయ్యానని త్రివిక్రమ్ చెప్పారు. అంతగా ఆయనను అభిమానించడం వల్లనేనేమో, త్రివిక్రమ్ ఆ ఇంటి అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు.
త్రివిక్రమ్ ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు. రచయితగా ఒక్కో సినిమాకు ఆయన ఎదుగుతూ వస్తున్నారు. ఏదో సినిమాలకి డైలాగులు రాస్తున్నాడులే అని కాకుండా, అప్పటివరకూ నడుస్తూ వచ్చిన ట్రెండ్ కి ఆయన ఫుల్ స్టాప్ పెట్టేశారు. త్రివిక్రమ్ మార్క్ డైలాగులు ఆయనకి విపరీతమైన పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టసాగాయి. అలాంటి సమయంలోనే ఆయన సిరివెన్నెల సోదరుడి కూతురైన సౌజన్యను చూసుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే అప్పటికే త్రివిక్రమ్ ఎదుగుదలను చూస్తూ వచ్చిన సిరివెన్నెల, తన ఇంట్లోనే వారి పెళ్లి చూపులను ఏర్పాటు చేశారట.
అలా త్రివిక్రమ్ .. సిరివెన్నెల సోదరుడి కుమార్తె అయిన సౌజన్యను వివాహం చేసుకున్నారు. అంటే సిరివెన్నెల .. త్రివిక్రమ్ కి మావగారి వరసన్న మాట. మొదటి నుంచి కూడా తెలుగు సాహిత్యం అంటే త్రివిక్రమ్ కి ఎంతో ఇష్టం. అందునా సిరివెన్నెలవారి పాటలంటే ప్రాణం. అందువలన ఈ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతూ వచ్చింది. ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకుడు అయిన తరువాత చాలా పాటలను సిరివెన్నెలతోనే రాయించారు. వాటిలో ఎన్నో సూపర్ హిట్ పాటలు ఉన్నాయి. 'అరవింద సమేత'లో 'అనగనగనగా ..' అనే పాట సిరివెన్నెల రాసినదే.
ఇక 'అల వైకుంఠపురములో' సినిమాలో 'సామజ వర గమన' పాట సిరివెన్నెల కలం నుంచి జాలువారినదే. ఈ పాట సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే .. చిన్నపిల్లలకు ఎక్కువగా కనెక్ట్ అయిపోయింది. అలా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలకు సిరివెన్నెల పసందైన పాటలను .. పండుగలాంటి పాటలను అందించారు. నవరసాలలో ఏ రసానికి సంబంధించిన పాటైనా .. ఏ అంశానికి సంబంధించిన పాటైనా .. ఏ సందర్భానికి సంబంధించిన పాటైనా అవలీలగా రాయగలిగే ఒక పాటల తోటమాలిని కోల్పోవడం నిజంగా దురదృష్టమే.