త్రివిక్రమ్‌కి గ్యాప్ తప్పదా?
సినిమాకీ సినిమాకీ మధ్య బాగా విరామం తీసుకొంటుంటారు త్రివిక్రమ్. సెట్స్‌పైకి వెళ్లాక కూడా తీరిగ్గానే సినిమా చేస్తుంటారాయన. కాస్త ఆలస్యమైనా ఒక మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నదే త్రివిక్రమ్ ఉద్దేశం కావొచ్చు. 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రానికి ముందు కూడా ఆర్నెళ్లు ఖాళీగా ఉన్నారు త్రివిక్రమ్. ఆ ఆర్నెళ్లపాటు అల్లు అర్జున్‌ని కూడా ఖాళీగా ఉంచి... 'సన్నాఫ్ సత్యమూర్తి' కథని సిద్ధం చేశారు. కానీ అల్లు అర్జున్ మాత్రం సమయస్ఫూర్తితో ఆలోచించి మధ్యలో 'రుద్రమదేవి' చేసేందుకు ఒప్పుకొన్నారు. నెల రోజులపాటు ఆ సినిమాకి కాల్షీట్లు కేటాయించి తనకి గ్యాప్ రాకుండా చూసుకొన్నారు.
ఇటీవలే 'సన్నాఫ్ సత్యమూర్తి'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన త్రివిక్రమ్ మళ్లీ ఒక ఆరేడు నెలలపాటు గ్యాప్ తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా చేయనున్న సినిమా ఏంటి? అంటే ఇంకా ఏమీ ఆలోచించలేదు అంటున్నారాయన. నిజానికి త్రివిక్రమ్ మహేష్‌తో ఇప్పుడొక సినిమా చేయాలి. కానీ ఆ ప్రాజెక్ట్ ఇప్పట్లో మెటీరియల్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మహేష్ చేస్తున్న 'శ్రీమంతుడు' పూర్తి అవ్వడానికి ఇంకా మూడు నెలల పడుతుంది. దానికితోడు మహేష్ కోసం త్రివిక్రమ్ దగ్గర కూడా కథ రెడీగా లేదు. ఒకవేళ త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేసినా... మరో ఆర్నెళ్లపాటు సమయం తీసుకొనే కథని సిద్ధం చేయాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.