నా ఒక్కడి సినిమానే ఆడాలనుకుంటా-త్రివిక్రమ్
తనను ప్రత్యేకమైన వ్యక్తిగా చూడొద్దంటున్నాడు త్రివిక్రమ్. తాను కూడా అందరిలాగే ఆలోచిస్తానని.. తనకూ ఇగోస్ ఉంటాయని అంటున్నాడీ మాటల మాంత్రికుడు. మీకంటూ ఓ బ్రాండ్ ఉందిగా అంటే త్రివిక్రమ్ ఆసక్తికరమైన మాటలు చెప్పారు. ఆయనేమన్నారో చూడండి.
''బ్రాండ్ అంటే భయమేస్తుంది. నేనేదో నాకొచ్చింది రాస్తాను. నచ్చితే చూడండి. లేదంటే తిట్టండి. నేఏదీ సీరియస్‌గా తీసుకోను. నాకూ సవాలక్ష సమస్యలుంటాయి. ఈగో, భయాలూ ఇవన్నీ ఉంటాయి. అందరిలాగే నా ఒక్కడి సినిమాలే ఆడాలని అనుకుంటా. కానీ బయట మాత్రం నవ్వుతూ.. అందరి సినిమాలు బాగుండాలి నాలి. తప్పదు. ఇలాంటి ఇగోల్ని ఒక్కొక్కటిగా వలుచుకుని స్వచ్ఛంగా ఉండే ప్రయత్నం చేస్తుంటా. నా ఒక్కడి సినిమానే ఆడి.. అందరి సినిమాలూ పోతే.. కనీసం నాతో సినిమా చేయడానికైనా ఓ నిర్మాత ఉండాలి కదా'' అన్నాడు త్రివిక్రమ్.
తన సినిమా హిట్టయితే బయటికొచ్చి సూపర్ హిట్ అని అరవలేనని.. అలాగే ఫ్లాప్ అయితే కూడా ఏడవలేనని.. సినిమా ఫలితం కంటే కూడా ఈ ప్రయాణమే తనకు కిక్కిస్తుందని త్రివిక్రమ్ తనదైన స్టయిల్లో చెప్పాడు. మంచి సీన్ రాస్తే ఆ క్షణంలోనే కిక్కు వస్తుందని.. ఆ ఆనందం ముందు ఏదీ సరితూగదని త్రివిక్రమ్ అన్నాడు.