ఆ మధ్యలో త్రివిక్రమ్ ఏం చేస్తాడు?

Update: 2018-12-31 01:30 GMT
‘అజ్ఞాతవాసి’ పరాజయం నుంచి త్వరగానే కోలుకుని ‘అరవింద సమేత’తో ఊరట పొందాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. దీంతో మళ్లీ అతడిపై ఇండస్ట్రీ జనాలకు గురి కుదిరినట్లే కనిపించింది. ‘నా పేరు సూర్య’ షాక్ తర్వాత ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న అల్లు అర్జున్.. విక్రమ్ కుమార్ తో అనుకున్న సినిమాను పక్కన పెట్టి మరీ త్రివిక్రమ్ తో జట్టు కట్టేందుకు ముందుకొచ్చాడు. ఈ కాంబినేషన్ లో సినిమా పక్కా అనే అంతా అనుకున్నారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ.. ఈ కాంబినేషన్ వర్కవుట్ కాలేదు. అల్లు అర్జున్.. త్రివిక్రమ్‌ కు హ్యాండిచ్చి ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్‌ తో సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. దీంతో త్రివిక్రమ్ పరిస్థితి ఏంటన్న అయోమయం నెలకొంది. కానీ ఇంతలోనే ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం బయటికి వచ్చింది.

ఈ న్యూస్ త్రివిక్రమ్ అభిమానులకు మహదానందాన్నిచ్చేదే అనడంలో సందేహం లేదు. కానీ త్రివిక్రమ్ సినిమాను ఇంకో ఏడాదికి కానీ మొదలుపెట్టే స్థితిలో లేడు చిరు. ఇంకా ఆయన ‘సైరా’నే పూర్తి చేయలేదు. దాని తర్వాత కొరటాల శివ సినిమా చేయాల్సి ఉంది. ఇవి రెండూ పూర్తి కావడానికి కనీసం ఏడాది పడుతుంది. మరి అప్పటిదాకా త్రివిక్రమ్ ఏం చేస్తాడన్నది అర్థం కాని విషయం. గతంతో పోలిస్తే త్రివిక్రమ్ స్పీడు పెంచాడు. ఆరు నెలలకు ఓ సినిమా పూర్తి చేసేస్తున్నాడు. స్క్రిప్టు కూడా వేగంగానే రాసేస్తున్నాడు. ఈ లెక్కన చూస్తే చిరు సినిమా మొదలుపెట్టే లోపు ఈజీగా ఇంకో చిత్రం చేసేయొచ్చు. కానీ త్రివిక్రమ్ కోరుకునే స్థాయి స్టార్లు ఎవ్వరూ ఇంకో ఏడాది వరకు ఖాళీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్.. రాజమౌళి చిత్రంలో బిజీ అయిపోయారు. అల్లు అర్జున్ వేరే సినిమాకు వెళ్లిపోతున్నాడు. మహేష్ బాబు ‘మహర్షి’ ముగించి సుకుమార్‌ తో సినిమా మొదలుపెట్టబోతున్నాడు. ప్రభాస్ కు ‘సాహో’తో పాటు ఇంకో సినిమా ఉంది. ఇలా పెద్ద స్టార్లందరూ బిజీన. మరి చిరు సినిమాకు ముందు గ్యాప్ లో త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేస్తాడన్నది అర్థం కావడం లేదు.
Tags:    

Similar News