అల్లు అర్జున్ 19లో కొత్త ఝలక్!!

Update: 2019-04-17 07:40 GMT
ఈ మధ్య దర్శకులు టైం బౌండ్ లో ఒత్తిడికి గురవుతూ పూర్తి స్క్రిప్ట్ రెడీ కాకుండానే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లిపోతున్నారు. ఒకప్పుడు ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ చేతిలో ఉంటే తప్ప హీరోలు షూటింగ్ మొదలుపెట్టేందుకు అనుమతించే వారు కారు. ఏదో దాసరి లాంటి సీనియర్లు మాత్రమే వరసగా కమిటైన ప్రాజెక్ట్స్ వల్ల అలా చేసేవారు కానీ అందరూ కాదు. సరే వాళ్లంటే ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసేవారు కాబట్టి అది పరిగణనలోకి తీసుకోవచ్చు.

కానీ ఏడాది రెండేళ్లకు ఒకటి తీసే దర్శకులు సైతం అలాగే చేస్తే ఏమనుకోవాలి. ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్న గాసిప్ ప్రకారం ఇటీవలే మొదలైన త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబో మూవీకి స్క్రిప్ట్ సగం దాకా రెడీ అయ్యిందట. ఇప్పటికే బాగా ఆలస్యం అవ్వడంతో పాటు అభిమానుల్లో ప్రతికూల సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో చేతిలో ఉన్న దానితో స్టార్ట్ చేస్తున్నారని సమాచారం. మరి బాలన్స్ సంగతేంటి అంటే ఒకవైపు షూటింగ్ జరుపుతూనే మరోవైపు సెకండ్ హాఫ్ కు సంబంధించిన వర్క్ ని ఇంకో నెలలో పూర్తి చేసేలా త్రివిక్రమ్ ప్లాన్ చేసుకున్నాడట.

ముందు అనుకున్న కథలో కొన్ని కీలకమైన మార్పులు జరగడం త్రివిక్రమ్ బన్నీ అల్లు అరవింద్ ల మధ్య చర్చల్లో వాటి గురించిన లోతుగా చర్చ జరగడం లాంటి కారణాల వల్ల ఇలా జరిగిందని తెలిసింది. విడుదల విషయంలో ఇంకా ఏ నిర్ణయానికి రాలేదని టాక్. ఈ ఏడాది దసరా లేదా దీపావళికి టార్గెట్ చేస్తున్నారు కానీ ఎంతవరకు ఇది సాధ్యమవుతుంది అనేది షూటింగ్ పూర్తయ్యే సమయాన్ని బట్టి ఉంటుంది. మొత్తానికి బన్నీ మూడు సినిమాలు ప్రకటించినా అభిమానులకు ఏదో ఒక రూపంలో టెన్షన్ మాత్రం తప్పడం లేదు
Tags:    

Similar News