ఎన్టీఆర్ తర్వాతే ఏదైనా.. అంటున్న స్టార్ డైరెక్టర్

Update: 2020-05-18 11:30 GMT
తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత సినిమా 2018 సంవత్సరంలోని బ్లాక్ బస్టర్ లలో ఒకటి. ఎన్టీఆర్ కెరీర్లో అరవింద సమేత ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో.. అందరికి తెలిసిందే. మాటల మాంత్రికుడు ఎన్టీఆర్ కలిస్తే ఆ మ్యాజిక్ వేరు. ఎన్టీఆర్ నుండి కొత్తరకం బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ పలికించిన ఘనత త్రివిక్రమ్ కి చెందుతుంది. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమాతో బిజీ అయిపోయాడు. త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో కలిసి 'అల వైకుంఠపురంలో' సినిమాతో ఈ ఏడాది సంక్రాంతికి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే తదుపరి సినిమా ఎన్టీఆర్ తోనే తెరకెక్కించనున్నాడు. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తి చూపిస్తున్నాడట. వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ఖరారు చేశారు.

అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఇప్పట్లో కుదిరే అవకాశాలు లేవని.. ఎందుకంటే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ఇంకా చాలా డేట్స్ ఆర్ఆర్ఆర్ కోసం కేటాయించాల్సి ఉన్న నేపథ్యంలో చాలా గ్యాప్ వస్తుందని త్రివిక్రమ్ భావించినట్లు.. ఈ గ్యాప్ లో మరో సినిమా తీద్దామని అనుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఎన్టీఆర్ 'అయినను పోయిరావలె హస్తినకు' సినిమా కంటే ముందు ఏ సినిమా తీయట్లేదని.. కేవలం ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పనుల మీద దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎన్టీఆర్ తో ఈ సినిమా పూర్తి చేశాకే వేరే సినిమా గురించి ఆలోచిస్తారని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అవసరం అవుతారట. హీరోయిన్స్ గా జాన్వీ కపూర్, నివేద పేతురాజ్ లను పరిశీలిస్తున్నట్లు టాక్.
Tags:    

Similar News