దళారీ వ్యవస్థపై మెగా స్టెన్ గన్ గురి?
ఖైదీనంబర్ 150 లాంటి ఫక్తు కమర్షియల్ సినిమా చేసిన మెగాస్టార్ ఆ తర్వాత స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథలో నటించారు. సైరా నరసింహారెడ్డి మెగా పెర్ఫామెన్సెస్ తో టెక్నికల్ వండర్ గా పేరు తెచ్చుకుంది. కంబ్యాక్ లో ఆ రెండిటి కంటే భిన్నమైన కాన్సెప్టుని ఎంచుకుని కొరటాల దర్శకత్వంలో నటిస్తున్నారు చిరంజీవి.
`ఆచార్య` చిత్రం దేవాలయ కుంభకోణాల నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్ టైనర్ అన్న ప్రచారం అభిమానుల్లో హీట్ పెంచుతోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ సాగుతోంది. చిరంజీవి పై షెడ్యూల్ సాగుతోంది. ఇక ఈ మూవీ తర్వాత చిరు ఎవరితో పని చేస్తారు? ఎలాంటి కాన్సెప్టును ఎంచుకుంటారు? అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. చిరు మరో విలక్షణమైన కాన్సెప్టును ఎంచుకున్నారని తెలుస్తోంది. ఈసారి దళారీ వ్యవస్థపై గురి పెట్టే స్టెన్ గన్ లా కనిపిస్తారట చిరు. అంటే మరోసారి సామాజిక అవ్యవస్థపై పోరు సలిపేవాడిగా కనిపిస్తారు. ప్రస్తుతం దేవాలయ శాఖ కుంభకోణం.. నిధుల దుర్వినియోగం అంటూ సామాజిక రాజకీయ అంశాల్ని తెరపై చూపించబోతున్నారు. అందుకు భిన్నంగా మరో సామాజిక కాన్సెప్టునే ఎంచుకుని గురి పెట్టనున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది.
నిజానికి మాటల మాంత్రికుడు ఎన్టీఆర్ సినిమా తర్వాత మహేష్ తో పని చేయాల్సి ఉన్నా సూపర్ స్టార్ ఇప్పటికే రాజమౌళికి కమిటవ్వడంతో ఇప్పుడు మహేష్ స్థానంలో చిరంజీవితో సినిమా చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు. మెగాస్టార్ రేంజుకు తగ్గట్టు కథాంశాన్ని తయారు చేస్తున్నారని తెలిసింది. దళారీ వ్యవస్థపై లైన్ కి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో బౌండ్ స్క్రిప్ట్ రెడీ అవుతోంది. ఇక ఇందులోనూ త్రివిక్రమ్ మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ కి కొదవేమీ ఉండదు. కామెడీ.. సెటైర్ .. ప్రాస యాస టింజ్ సన్నివేశ బలం మిస్సవవ్వకుండా పక్కా స్క్రిప్టును సిద్ధం చేస్తున్నారట.