'ఎన్టీఆర్ - త్రివిక్రమ్' కాంబో ఇప్పట్లో కుదిరేలా లేదా..??

Update: 2020-07-18 12:30 GMT
డైరెక్టర్ త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కలిసి 'అల వైకుంఠపురంలో' సినిమాతో ఈ ఏడాది సంక్రాంతికి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తదుపరి సినిమా ఎన్టీఆర్ తోనే తెరకెక్కించనున్నాడు. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తి చూపిస్తున్నాడు. వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమాకు 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం త్రివిక్రమ్ స్క్రిప్ట్ అంత సిద్ధం చేసి ఎన్టీఆర్ తో సమావేశం కావడానికి వెయిట్ చేస్తున్నాడట. అయినను రావాలె హస్తినకు మూవీ ఫైనల్ స్క్రిప్ట్ వినిపించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేద్దామని చూస్తున్నారట.

ప్రస్తుతం కరోనా విజృంభించడంతో వీరి మీటింగ్ ఇప్పట్లో కుదిరేలా లేదట. త్రివిక్రమ్ ఈ స్క్రిప్ట్ తో పాటు మరికొన్ని స్క్రిప్టులు కూడా సిద్ధం చేసుకున్నాడట. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఇప్పట్లో కుదిరే అవకాశాలు లేవని ఇండస్ట్రీ టాక్. ఎందుకంటే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ఇంకా చాలా డేట్స్ ఆర్ఆర్ఆర్ కోసం కేటాయించాల్సి ఉన్న నేపథ్యంలో చాలా గ్యాప్ వస్తుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ మరో సినిమా తీద్దామని అనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి.

అయితే ఎన్టీఆర్ 'అయినను పోయిరావలె హస్తినకు' సినిమా కంటే ముందు ఏ సినిమా తీయట్లేదని.. కేవలం ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పనుల మీద దృష్టి పెట్టానని.. అలాగే ఎన్టీఆర్ తో ఈ సినిమా పూర్తి చేశాకే వేరే సినిమా గురించి ఆలోచిస్తానని త్రివిక్రమ్ తెలిపాడు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ తో సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం కూడా చెప్పాలని త్రివిక్రమ్ అనుకుంటున్నాడట. మరి ఎన్టీఆర్ రియాక్షన్ ఎలా ఉండనుందో చూడాలి. ఇదిలా ఉండగా.. అయినను పోయిరావలె హస్తినకు సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.
Tags:    

Similar News