ప్రయోగాలకు దూరంగా త్రివిక్రమ్‌, బన్నీ మూవీ

Update: 2019-02-25 08:24 GMT
మాటల మాంత్రికుడు మూవీ అనగానే ప్రేక్షకులు పంచ్‌ డైలాగ్స్‌ మరియు ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ను ఆశిస్తారు. అయితే ఆ రెండు కూడా త్రివిక్రమ్‌ గత చిత్రం 'అరవింద సమేత' చిత్రంలో లేవు. దాంతో సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా కలెక్షన్స్‌ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. అరవింద సమేత చిత్రానికి ఓవర్సీస్‌ లో నష్టాలు రావడానికి, ఆశించిన స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు నమోదు అవ్వక పోవడానికి ప్రధాన కారణం ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ఆశించిన స్థాయిలో లేకపోవడం అనేది అందరు ఒప్పుకునే విషయం. అందుకే తదుపరి చిత్రం విషయంలో అలాంటి తప్పు జరుగకుండా ఉండాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నాడు.

త్రివిక్రమ్‌ తదుపరి మూవీ అల్లు అర్జున్‌ తో కన్ఫర్మ్‌ అయ్యింది. ఇప్పటికే అందుకు సంబంధించిన కథా చర్చలు పూర్తి అయ్యాయి. తన గత చిత్రాల్లో మిస్‌ అయిన ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ను ఈ చిత్రంలో మిస్‌ కాకుండా, ప్రయోగాలు చేయకుండా తన రెగ్యులర్‌ పార్మెట్‌ లో సినిమాను చేయాలని నిర్ణయించుకున్నాడు. స్క్రీన్‌ ప్లే పూర్తి ఎంటర్‌ టైన్‌ మెంట్‌ తో సాగేలా ప్లాన్‌ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ స్క్రీన్‌ ప్లేకు మెగా కాంపౌండ్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని, త్వరలోనే సినిమాను పట్టాలెక్కించే పనిలో త్రివిక్రమ్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది. సినిమా పూర్తి వివరాలను అతి త్వరలోనే ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. రాధాకృష్ణ మరియు అల్లు అరవింద్‌ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం కనిపిస్తోంది.
Tags:    

Similar News