పవన్ మూవీ పొంగల్ కే...

Update: 2017-05-29 16:25 GMT
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడిచిపోతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఏప్రిల్ తొలి వారంలో షూటింగ్ ప్రారంభం కాగా.. షూటింగ్ శరవేగంగానే జరుగుతోంది. షెడ్యూల్ ప్రకారం ఏ మాత్రం గ్యాప్ రాకుండా జాగ్రత్త పడుతూ షూట్ చేస్తున్నారు. ఇప్పటివరకూ ఎక్కడా చిన్న బ్రేక్ కూడా పడలేదు కానీ.. రిలీజ్ డేట్ పై దర్శకుడిలో ఇప్పటికే కొన్ని అనుమానాలు స్టార్ట్ అయిపోయాయట.

ఈ మూవీని సెప్టెంబర్ చివరకు రిలీజ్ చేయాలన్నది పవన్ ఆలోచన. అందుకు తగ్గట్లుగానే షెడ్యూల్స్ కూడా ప్లాన్ చేశారు. కానీ ఇప్పటివరకూ జరిగిన భాగం.. ఇంకా తీయాల్సిన పార్ట్ ను చూసుకుంటే.. సెప్టెంబర్ నాటికి పూర్తి చేయడం కొంచెం కష్టమే అని భావిస్తున్నారట. అందుకే ముందు జాగ్రత్తగా సంక్రాంతికి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్ రిలీజ్ అంటూ నిర్మాత ఇప్పటికీ చెబుతున్నా సరే.. డిస్ట్రిబ్యూటర్స్ చెప్పే మాటలు వేరేలా ఉన్నాయి. తమకు ఇప్పటికే సంక్రాంతి రిలీజ్ అనే ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెబుతున్నారు.

పైగా పవన్ లేటెస్ట్ మూవీకి థియేట్రికల్ రైట్స్ భారీ మొత్తంలో కోట్ చేస్తున్నారు. కేవలం కోస్తా ఏరియా నుంచే 45 కోట్ల రూపాయలు అడుగుతున్నారని.. నైజాం నుంచి 32 కోట్లు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారని అంటున్నారు. ఇంత మొత్తం రికవర్ కావాలంటే అది పొంగల్ సీజన్ లో మాత్రమే సాధ్యమవుతుందని.. అందుకే తమ సినిమాని పవన్-త్రివిక్రమ్ లు సంక్రాంతికి వాయిదా వేసుకున్నారనే టాక్ కూడా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News