వర్జిన్‌ కుర్రాళ్ల ఉసురు తగుల్తుంది

Update: 2015-07-23 12:56 GMT

Full View
మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాష్‌ కుమార్‌ ఇన్నాళ్లు శ్రావ్యమైన సంగీతంతో అలరించాడు. ఇకనుంచి హీరోగా ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేస్తూ ఆకట్టుకోవడానికి రెడ అవుతున్నాడు. ఆరంభం వస్తూనే అతడు సెన్సేషన్‌ కి సిద్ధమయ్యాడు. మాస్‌ హీరోగా ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే 7/జి బృందావన కాలనీతో రవికృష్ణ ఎంత మ్యాజిక్‌ చేశాడో అంత మ్యాజిక్‌ చేయబోతున్నాడని అర్థమవుతోంది.

జీవీ నటించిన తమిళ చిత్రం త్రిష ఇలియాన నయనతార తెలుగులో త్రిష లేదా నయనతార అనే టైటిల్‌ తో రిలీజవుతోంది. ఈ చిత్రంలో తెలుగమ్మాయి రక్షిత (ఆనందిని), తమిళమ్మాయి మనీషా యాదవ్‌ కథానాయికలుగా నటించారు. ఈ ఇద్దరిలో ఎవరు త్రిష, ఎవరు నయనతార? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  హీరో అవ్వాలన్న జీవీ ఆలోచన బావుంది. అతడిని విజువల్‌ లో చూపించిన తీరు బావుంది. టీజర్‌ చూసిన వారికి ఇదో మాస్‌ యూత్‌ లవ్‌ స్టోరి అని అర్థమవుతోంది. పైగా ఇద్దరు చందమామల్లాంటి అమ్మాయిలతో జీవీ రొమాన్స్‌ ఇరగదీశాడు. గుబురు గడ్డం పెంచి ఆటోవాలా డ్రెస్‌ ధరించి చాలా కొత్తగా కనిపించాడు. ప్రియురాళ్లతో బోలెడంత ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ కుదిరిందని వీడియో చూస్తే అర్థమైపోతోంది. వర్జిన్‌ కుర్రాళ్ల ఉసురు పోసుకోకండే అంటూ జీవీ ఎక్స్‌ ప్రెషన్‌ హైలైట్‌.
Tags:    

Similar News