• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తెలుగు తెరపైకి...

తెలుగు తెరపైకి దరిద్రపుగొట్టు లవ్ స్టోరీ

By - Tupaki Desk
Update: 2015-11-02 10:38 GMT
ఇన్నాళ్లు చాలా రకాల ప్రచారాలు చూశాం. ఇలాంటి ప్రమోషన్ మాత్రం ఇదే మొదలు. ‘తెలుగు సినిమా చరిత్రలోనే ఇది పరమ చెత్త దరిద్రపుగొట్టు లవ్ స్టోరీ’ అనే ట్యాగ్ ను ఓ సినిమా సినిమా పోస్టర్ మీద వేసుకోవడం ఎప్పుడైనా చూశామా? తమిళ డబ్బింగ్ మూవీ ‘త్రిష లేదా నయనతార’ పోస్టర్ మీద ఈ ట్యాగ్ లైనే కనిపిస్తోంది. మామూలుగా వస్తే జనాలకు పట్టదనుకున్నారేమో.. ఇలాంటి దిగజారుడు ట్యాగ్ లైన్ ఒకటి తగిలించుకుని వస్తున్నారు. ఈ నెల 5న ఈ సినిమా తెలుగులో విడుదల కాబోతోంది.

తమిళంలో రెండు నెలల కిందటే విడుదలై సంచలన విజయం సాధించిందీ సినిమా. బాలీవుడ్ లో  వచ్చే అడల్ట్ కామెడీ టైపు సినిమా ఇది. తమిళ ప్రేక్షకులకు ఈ సినిమా కొత్తగా అనిపించింది. ట్రైలర్లోని బూతు మాటలు, బూతు సన్నివేశాలు చూసి.. యూత్ కు ఈ సినిమా మీద బాగానే ఆసక్తి కలిగింది. హీరో జి.వి.ప్రకాష్ కుమార్ చేసింది ఒక్క సినిమానే అయినా దీనికి భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి. టాక్ ఏవరేజ్ అని వినిపించినప్పటికీ.. యూత్ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.20 కోట్ల దాకా వసూలు చేసి.. సంచలనం సృష్టించింది. అదే ఊపులో తెలుగు బాక్సాఫీస్ ను కూడా ఏలేద్దామని వస్తోంది. మన తెలుగమ్మాయి ఆనంది తో పాటు మనీషా యాదవ్ ఓ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సిమ్రాన్ గెస్ట్ రోల్ చేయడం విశేషం. ఆదిక్ రవిచంద్రన్ దర్శకుడు.
Tags:    
  • GV Prakash 
  • Trisha Leda Nayanthara 
  • Telugu NEWs 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS