సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న సీనియర్ హీరోయిన్...!
సౌత్ ఇండస్ట్రీ సీనియర్ హీరోయిన్స్ లో ఒకరైన త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ టాలీవుడ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది త్రిష. 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ 'వర్షం' సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. సీనియర్ హీరోలు.. కుర్ర హీరోలు అని తేడా లేకుండా అందరితో నటించింది. చిరంజీవి - నాగార్జున - వెంకటేష్ - బాలయ్య - మహేష్ బాబు - ప్రభాస్ - పవన్ కళ్యాణ్ - ఎన్టీఆర్ - రవితేజ లాంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది. అయితే కొన్నేళ్లుగా తెలుగులో పెద్దగా ఛాన్సెస్ తెచ్చుకోలేకపోయిన త్రిష తమిళంలో మాత్రం వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కెరీర్లో ఎప్పుడూ లేనంత ఫుల్ ఫామ్ లో దూసుకుపోతోంది. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన 'ఆచార్య' సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా డేట్స్ క్లాస్ రావడంతో వదులుకుంది.
కాగా ప్రస్తుతం త్రిష నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఆమె చేతిలో మరో నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తమిళ్ లో త్రిష నటించిన 'పారపాధమ్ విలయట్టు' 'గర్జనాని' సినిమాలు ఇప్పటికే కంప్లీట్ చేసింది. మణిరత్నం తెరకెక్కిస్తున్న 'పొన్నియన్ సెల్వన్' చిత్రంలోనూ నటిస్తోంది ఈ బ్యూటీ. అలాగే 'రాంగీ' 'షుగర్' అనే సినిమాలు కూడా చిత్రీకరణ దశలో ఉన్నాయి. వీటితో పాటు మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ అప్ కమింగ్ మూవీ 'రామ్' త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా నేపథ్యంలో షూటింగ్ నిలుపుదల చేసుకున్న 'రామ్' ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. త్రిష కూడా ఈ చిత్రీకరణలో పాల్గొంటోంది. అందరూ స్టార్ హీరోయిన్లు కరోనా నేపథ్యంలో బయటకు రావడానికి కూడా బయపడుతుంటే త్రిష మాత్రం ధైర్యంగా షూటింగ్ కి హాజర్ అవుతుండటం ఇప్పుడు తమిళ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీద త్రిష 37 ఏళ్ళ వయసులో కూడా యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ తన హవా చూపిస్తోందని చెప్పవచ్చు.