• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దాంపత్య జీవితంలోకి...

దాంపత్య జీవితంలోకి ట్రాన్స్ ఉమెన్.. ప్రేమికుడితో పెళ్లి!

By - Tupaki Desk
Update: 2021-01-21 11:30 GMT
ట్రాన్స్‌వుమెన్, మళయాల సినీ పరిశ్రమలో నటి అయిన‌ ఎలిజబెత్‌ హరిణి చందన దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టారు. తాను ప్రేమిస్తున్న సునీష్ అనే వ్యక్తితో వేదమంత్రోచ్ఛరణల నడుమ ఏడడుగులు నడిచారు. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలోని బీటీహెచ్‌ హాల్‌లో ఈ పెళ్లి జరిగింది. ఈ వేడుకకు రెండు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

ఎలిజబెత్ తల్లి స్థానంలో ట్రాన్స్‌జెండర్‌ రెంజు రెంజిమార్‌ నిలబడి ఈ వివాహ కార్యక్రమాన్ని పూర్తిచేశారు. ఎలిజబెత్‌ను పెళ్లి కూతురిని చేయడం మొదలు.. అప్పగింతల వరకు అన్ని కార్యక్రమాలను ఆమె దగ్గరుండి చూసుకున్నారు. పెళ్లి అనంతరం ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఆమె.. "తల్లిగా నా బాధ్యతలను పూర్తి చేశాను. నా చేతుల మీదుగా కూతురి పెళ్లి చేశాను. భగవంతుడికి కృతజ‍్క్షతలు" అని రాశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా.. కుంబలంగికి చెందిన ఎలిజబెత్ 17 ఏళ్ల వయసులో సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారారు. ఆ తర్వాత 2017లో కొచ్చిలో జరిగిన ట్రాన్స్‌జెండర్‌ అందాల పోటీలో ఆమె సెకండ్‌ రన్నరప్‌గా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించారు.

ఆ తర్వాత సినీ పరిశ్రమలోకి కూడా ప్రవేశించారు. 'దైవత్తింటే మనవట్టి' అనే మలయాళ హిట్‌ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు ఎలిజబెత్ హరిణి చందన. ఇందులో నటుడు జయసూర్య ముఖ్యపాత్రలో కనిపించారు. ట్రాన్స్ ఉమెన్ గా మారి, సినిమాల్లో నటించడమే కాకుండా.. వైవాహిక జీవితంలోకీ ప్రవేశించిన ఎలిజబెత్ కు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Tags:    
  • Latest News 
  • Tupaki News 
  • Telugu News 
  • Malayalam Industry 
  • Daily Reports 
  • Tupaki Updates 

Similar News

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS