• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్ టాక్: వైఫ్.....

ట్రైలర్ టాక్: వైఫ్.. మిస్సింగ్ సర్ అంటున్న టెంప్ట్ రవి!

By - Tupaki Desk
Update: 2019-11-26 09:10 GMT
'ఏడు చేపల కథ' లో టెంప్ట్ రవి గా నటించి ఒక్క టీజర్ తోనే భారీ పాపులారిటీ సంపాదించిన హీరో అభిషేక్ రెడ్డి. ఈ మధ్యే ఆ సినిమా కూడా విడుదలైంది. ఇప్పుడు మరో సినిమా తో అభిషేక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా అభిషేక్ నటించిన కొత్త సినిమా 'వైఫ్,ఐ' సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో గుంజన్.. ఫిదా గిల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు జీ.ఎస్.ఎస్.పీ కళ్యాణ్.

ట్రైలర్ ఆరంభం లో అభిషేక్ పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు.. అక్కడున్న పోలీస్ తో 'కంప్లయింటు.." అంటాడు. ఆ పోలీస్ ఫోన్ లో మాట్లాడుతూ ఎంతో రొటీన్ గా 'కూచొ' అంటాడు. "వైఫ్.. మిస్సింగ్ సర్" అంటూ తన వెర్షన్ చెప్తాడు. పోలీసు ఆఫీసర్ మరికొన్ని ప్రశ్నలు వేస్తాడు. కొన్ని షాట్స్ లో ఫిదా గిల్ తో ప్రేమ.. తర్వాత గొడవలు లాంటివి చూపించారు. ఇక "ఇల్లీగల్ ఎఫైర్స్ ఏవైనా ఉన్నాయా?" అని పోలీస్ ప్రశ్నించగానే అభిషేక్-గుంజన్ మధ్య జరిగిన మరపురాని రాత్రులకు సంబంధించిన మహా బోల్డ్ షాట్స్ చూపిస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి సీన్ ఒక ఓపెన్ ప్లేస్ లో రోడ్ కు మారుతుంది. అక్కడ ట్విస్ట్ ఏంటంటే రోడ్ మీద ఒక బీర్ బాటిల్ పగలగొట్టి బాజీగర్ షారూఖ్ తరహాలో "వైఫ్ అన్నాను కానీ నా వైఫ్ అన్నానా?" అంటూ అభిషేక్ ఒక విలన్ తరహా లో పెద్ద గా నవ్వుతాడు.

ఫిదా గిల్ తో ప్రేమ.. పెళ్లి.. ఆ తర్వాత గుంజన్ తో అక్రమ సంబంధం. ఆ తర్వాత ఏం జరిగింది అనేది స్టొరీలైన్ లాగా అనిపిస్తోంది. ఈ పాయింట్ లోనే బోల్డు బోల్డ్ సీన్స్ కు స్కోప్ ఉంది కదా. అందుకే ఫుల్ గా దట్టించారు. అసలు అభిషేక్ - గుంజన్ మధ్య హాట్ సీన్లు చూస్తే బాలీవుడ్ ఇమ్రాన్ హష్మి కూడా సిగ్గుతో బిక్కచచ్చిపోతాడు! సరే.. మన టాలీవుడ్ కూడా ఎదిగింది కదా అని సంతోషించాలి. టీజర్ ను ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. సంప్రదాయవాదుల నసను.. సణుగుడును పక్కనపెడితే సాధారణ ప్రేక్షకులకు మాత్రం సినిమాపై ఇంట్రెస్ట్ కలిగించేదిలా ఉంది. ఆలస్యం ఎందుకు.. చూసేయండి.. కొన్ని షాట్లలో లోతు అర్థం కావాలంటే స్లో మోషన్ లోనో.. రిపీట్ మోడ్ లోనో చూడండి. లేకపోతే అభిషేక్ గారి రసికతను క్యాచ్ చెయ్యలేరు!
Full View
Tags:    
  • Wife I Theatrical Trailer Talk 
  • Tempt Ravi 
  • Yedu Chepala Kadha Movie Hero Movies 
  • Tollywood 
  • Tollywood Latest Trailers 
  • Tupaki News 

Similar News

కీరవాణి అంకితభావంపై అనుపమ్ ఖేర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

2026-11-13 08:34 GMT

నాగశౌర్యతో విభేదాలపై స్పందించిన వెంకీ కుడుముల..!

2026-11-13 08:33 GMT

'జంగా' గ్లింప్స్: నోట్లో మందు బాటిల్.. శ్మశానంలో చితి మంటలు

2026-11-13 08:31 GMT

తెరపై సౌమ్యుడు..తెర వెనుక అల్లరి పిల్లాడు!

2026-11-13 08:30 GMT

రణబీర్, యష్‌ల రామాయణకు గౌతమ్ ఘట్టమనేని రేటింగ్.. ఎంత ఇచ్చాడంటే!

2026-11-13 07:16 GMT

తెలుగు ఆడియన్స్ పల్స్ పట్టేసిన దుల్కర్.. మిగతా హీరోలు నేర్చుకోవాల్సింది ఇదే!

2026-11-13 07:08 GMT

రాజమౌళి సక్సెస్ కి శంకర్ ఫెయిల్యూర్ కి కారణం ఇదే...

2026-11-13 07:07 GMT

పవన్ కళ్యాణ్ కి ఓజీ అంటే అంత ఇష్టం ఉండటానికి కారణం ఏంటి?

2026-11-13 07:06 GMT

1000 కోట్ల క్లబ్.. హీరోగా ఒకటి.. విలన్‌గా మరొకటి

2026-11-13 06:47 GMT

'డి.ఎన్.కె' మూవీ రివ్యూ

2026-11-13 06:35 GMT

షాకింగ్: బాలీవుడ్ మెగాస్టార్ కుటుంబంలో ఆస్తి వివాదాలు?

2026-11-13 04:09 GMT

సినిమా నిర్మాత‌కు, ఫైనాన్షియ‌ర్‌కు మ‌ధ్య ఉండే ప్ర‌ధాన‌మైన తేడా?

2026-11-13 04:08 GMT

Copyright @2026

Powered by Blink CMS