బ్రేకింగ్‌ న్యూస్‌ : స్టార్‌ డైరెక్టర్‌ కు పితృ వియోగం

Update: 2020-08-01 09:30 GMT
టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల తండ్రి కమ్ముల శేషయ్య అనారోగ్యంతో మృతి చెందారు. హైదరాబాద్‌ లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతున్న శేషయ్య అరోగ్యం మరింతగా క్షీణించడంతో మృతి చెందారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అధికారికంగా వెళ్లడి చేశారు. 89 ఏళ్ల శేషయ్య కొడుకు శేఖర్‌ కమ్ముల తీసిన ఆనంద్‌ ఇంకా లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ చిత్రాల్లో కనిపించారు.

కమ్ముల శేషయ్య మృతితో శేఖర్‌ కమ్ముల కుటుంబ సభ్యులు శోకంలో మునిగి పోయారు. భన్సిలాల్‌ పేట స్మశాన వాటికలో శేషయ్య అంత్య క్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శేషయ్య మృతిపై శేఖర్‌ కమ్ముల ఫ్యాన్స్‌ మరియు శ్రేయోభిలాషులు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. కరోనా కారణంగా ఆయన చివరి చూపుకు కూడా సన్నిహితులు నోచుకోలేక పోతున్నారట. సినీ ప్రముఖులు ఫోన్‌ ద్వారా శేఖర్‌ కమ్ములను పరామర్శించి తమ సంతాపం తెలియజేశారు.

ఆయన కుటుంబ సభ్యులకు మనో ధైర్యం ప్రసాదించాలని శేషయ్య ఆత్మకు శాంతి కలగాలంటూ సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా వేడుకుంటున్నారు. శేఖర్‌ కమ్ముల అభిమానుల తరపున మరియు మా తరపున కూడా శేఖర్‌ కమ్ముల గారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అలాగే శేషయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం.
Tags:    

Similar News