• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #గుస‌గుస‌: భ‌ర్త‌తో బాపు...

#గుస‌గుస‌: భ‌ర్త‌తో బాపు బొమ్మ క‌ల‌త‌లు..?

By - Tupaki Desk
Update: 2022-11-13 01:30 GMT
భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య క‌ల‌త‌లు విభేధాలు చాలా స‌హ‌జం. కానీ ఇటీవ‌లి కాలంలో ఇవ‌న్నీ విడాకులకు దారి తీస్తుండ‌డ‌మే ఆందోళ‌న‌క‌రం. ముఖ్యంగా సెల‌బ్రిటీ ప్ర‌పంచంలో ఎప్పుడు ఏ జంట విడిపోతున్నారో ఊహకంద‌నిదిగా ఉంది. ఇంత‌కుముందు స‌మంత- నాగ‌చైత‌న్య జంట బ్రేక‌ప్.. ఆ త‌ర్వాత అమీర్ ఖాన్- కిర‌ణ్ రావ్ విడాకులు.. ఇటీవ‌ల ధ‌నుష్‌- ఐశ్వ‌ర్య జంట క‌ల‌త‌లు విడాకుల‌ ప్ర‌క‌ట‌న ఇవ‌న్నీ చూశాక అభిమానులు వ‌రుస షాక్ లు తిన్నారు. ఇప్పుడు ఊహించ‌ని విధంగా ప్ర‌ముఖ క‌థానాయిక త‌న భర్త (త‌మిళ హీరో) నుంచి విడిపోనున్నార‌ని గుస‌గుస‌లు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

సాంప్ర‌దాయ చీర‌క‌ట్టులో బాపు బొమ్మ‌లా క‌నిపించినా.. గ్లామ‌ర‌స్ దుస్తుల్లో హాట్ గా క‌వ్వించినా ...నాయుడు మామ మెచ్చే ఎంకీలా చిరున‌వ్వుల‌తో గుండెల్లో గుచ్చేసినా ఈ హీరోయిన్ అంటే ఇష్ట‌ప‌డ‌ని తెలుగు-త‌మిళ‌ ప్రేక్ష‌కులు లేరు. అటు మ‌ల‌యాళం- క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌ల‌కు ఈ భామ సుప‌రిచితం. తాను ఎంతో  ఇష్ట‌ప‌డి.. ప్రేమించి ప్ర‌ముఖ త‌మిళ హీరోని పెళ్లాడిన ఈ అందాల హీరోయిన్ కి ఇప్పుడు ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. ప్ర‌తిసారీ త‌మ ఇంట్లో జ‌రిగే వేడుక‌ల నుంచి ఫోటోలు వీడియోల‌ను కూడా సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేసేవారు.

భార్యాభ‌ర్త‌ల న‌డుమ అన్యోన్య‌త‌కు సంబంధించిన ఫోటోలు వీడియోలు చూసి అభిమానులు సంబర‌ప‌డేవారు. ఈడు జోడు కుదిరిన‌ చూడ‌ముచ్చ‌టైన‌ ఈ జంట అన్యోన్య‌త ఎంతో గొప్ప‌ది అంటూ ప్ర‌శంసించేవారు.

అయితే ఉన్న‌ట్టుండి ఏమైందో స‌డెన్ గా కాపుర‌లంలో క‌ల‌త‌లు మొద‌ల‌య్యాయ‌ని .. ప్ర‌స్తుతం స‌ద‌రు హీరోయిన్ పిల్ల‌ల‌తో క‌లిసి విడిగా ఉంటోంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా త‌మిళ మీడియాలో వ‌చ్చిన వార్తా క‌థ‌నాల ఆధారంగా తెలుగు మీడియాలోను గుస‌గుస‌లు వైర‌ల్ అవుతున్నాయి.

నిజానికి ఈ జంట మ‌ధ్య అంత పెద్ద పొర‌పొచ్చాలు ఏం వ‌చ్చాయి?  ఈగో స‌మస్య‌లు ప‌రిష్కారం కాలేదా? అస‌లింత‌కీ ఏం జ‌రుగుతోంది? అంటూ ఇప్పుడు ఆరాలు మొద‌ల‌య్యాయి. ఓవైపు ధ‌నుష్‌- ఐశ్వ‌ర్య జంట‌ను క‌లిపేందుకు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కుటుంబం.. సామ్-చై జంట‌ను క‌లిపేందుకు అక్కినేని నాగార్జున త‌మ వంతు ప్ర‌య‌త్నాలు చేశార‌ని ప్ర‌చారం ఉంది. ఇప్పుడు బ్రేక‌ప్ క‌థ‌నాల్లో న‌లుగుతున్న ప్ర‌ముఖ స్టార్ క‌పుల్ న‌డుమ పెద్ద‌ల ప్రేమ‌యంతో ఎలాంటి ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి? అన్న‌దానిపైనా వివ‌రం లేదు.

అయితే త‌మ ఫేవ‌రెట్  న‌టి బ్రేక‌ప్ క‌బురు నిజం కాకూడ‌ద‌ని అభిమానులు భావిస్తున్నారు. ప్రేమ‌క‌థా చిత్రాల‌తో పాటు భ‌క్తిర‌స చిత్రాల్లోను త‌న‌దైన అద్భుత న‌ట‌న‌తో మెప్పించిన స‌ద‌రు బాపు బొమ్మ‌కు తెలుగులో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది. పెళ్లి త‌ర్వాత 41 వ‌య‌సులో త‌న స్థాయికి త‌గ్గ స‌హాయ‌క పాత్ర‌ల‌తోను మెప్పిస్తోంది ఈ న‌టి. త‌మ‌పై వ‌స్తున్న తాజా రూమ‌ర్ పై స‌ద‌రు హీరోయిన్ కానీ హీరో కాని పెద‌వి విప్ప‌లేదు. వార్తా క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నా అంతా సైలెన్స్ ని మెయింటెయిన్ చేస్తున్నారు. ఇందులో నిజం ఎంత‌? అన్న‌ది వేచి చూడాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • GlamoursActress 
  • Telugu 
  • Tamil 
  • Kannada 
  • StarCouple 
  • Chaitanya 
  • Samantha 
  • AmirKhan 
  • KiraniRave 
  • Dhanush 
  • Aishwarya 
  • TamilHero 
  • MovieNews 

Similar News

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

నాశిర‌కం 'కింగ్'.. సాంగ్ విజువ‌ల్స్‌పై విమ‌ర్శ‌లు

2026-11-03 04:30 GMT

'పాన్ ఇండియా' ఎవ‌రు మొద‌లు పెట్టారు? 'కింగ్ నాగార్జున‌'పై సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

2026-11-03 04:27 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

అనిల్ రావిపూడి మార్క్ హంగామా ఏదీ?

2026-11-03 04:26 GMT

ఆ నీడ‌లో ఉన్న‌ది మాజీ ప్రియుడా? క‌న్ఫ్యూజన్‌లో న‌టి ఫ్యాన్స్!

2026-11-03 04:20 GMT

సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!

2026-11-03 04:19 GMT

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Bigg Boss Telugu 10: రోహిత్ రీ-ఎంట్రీపై పెరుగుతున్న ఊహాగానాలు!

2026-11-03 04:12 GMT

ఎల్లమ్మ.. యాక్షన్ సంగతేంటి?

2026-11-03 04:00 GMT

Copyright @2026

Powered by Blink CMS