దత్ గారూ.. ఇలా చేసి థియేటర్లు ఎత్తేయాలనా?
ఓటీటీల్లో సినిమాలు రిలీజ్ చేయడం సరైనదా కాదా? ఇలా అయితే థియేటర్ల రంగం ఎత్తేసినట్టేనా? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే నిర్మాతలు మాత్రం తాము నష్టపోకుండా గట్టెక్కేదెలా? అన్నదే ఆలోచిస్తూ ఓటీటీ రిలీజ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది ఎగ్జిబిటర్లకు ఏమాత్రం గిట్టని వ్యవహారంగా మారింది. మరి ఇలాంటప్పుడు నిర్మాతల్ని డిపెండ్ చేసేందుకు ఎవరో ఒకరు రావాలి కదా? టాలీవుడ్ నుంచి ఎవరొచ్చారు? అంటే.. వైజయంతి మూవీస్ అధినేత అశ్వనిదత్ ఒక్కరే కనిపిస్తున్నారు. అయితే డి.సురేష్ బాబు.. అల్లు అరవింద్ వంటి వారు ఓటీటీలకు ఏమాత్రం వ్యతిరేకులు కారు. నైజాం కింగ్ దిల్ రాజు ఓటీటీలకు వ్యతిరేకి కాదు. ఎగ్జిబిషన్ రంగం కలతలో ఉందనే చెబుతారు అంతే.
ఈ సీజన్ లో ఓటీటీ రిలీజ్ లలో ఏవి బెస్ట్? అంట.. సూర్య ఆకాశం నీ హద్దురా.. నాని వి చిత్రాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఆకాశం నీ హద్దురా చిత్రానికి సుధ కొంగర దర్శకత్వం వహించారు. అక్టోబర్ 30 నుండి అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. నాని- సుధీర్ బాబు హీరోలుగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి చిత్రం `వి` సెప్టెంబర్ 5 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక టాలీవుడ్ వదిలేస్తే కోలీవుడ్ లో మాత్రం సూర్యపై ఎగ్జిబిటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
తాజాగా సూర్య ఆలోచన మార్చుకుంటే మంచిదని సింగం హరి లాంటి సన్నిహితుడు కోరడం చూస్తుంటే ఓటీటీ రిలీజ్ ఎంతగా కలతకు గురి చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. సమీప భవిష్యత్తులో థియేటర్లు తిరిగి తెరవకపోవచ్చు అన్న ఆవేదనను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ మాత్రం అందుకు భిన్నంగా సూర్య .. నాని నిర్మాతల నిర్ణయానికి మద్దతుగా నిలిచారు. పైగా ఓటీటీ విడుదలను ఎంచుకున్నందుకు వారిద్దరినీ ప్రశంసించారు. ``ఇంట్లో సురక్షితంగా ఉండి వినోదం కోరుకునేవారికి సూర్య- నాని ఒక మార్గం చూపిస్తున్నారు`` అని ఆయన అన్నారు. జనవరి వరకు థియేటర్లు తిరిగి తెరవకపోవచ్చని అశ్విని దత్ తెలిపారు. ఓటీటీ ఒక్కటే బెస్ట్ అని కూడా అనేశారు.