సినిమాటోగ్రఫీ మినిస్టర్ తో టాలీవుడ్ నిర్మాతల భేటీ..!
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీని ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమపై కూడా బాగానే పడిందని చెప్పవచ్చు. సినీ ఇండస్ట్రీ చరిత్రలో ఎన్నో సంక్షోభాలను విపత్తులను ఎదుర్కొన్నప్పటికీ ఇంతటి రేంజ్ లో ఎప్పుడు నష్టం చవి చూడలేదు. సినిమా షూటింగులు ఆగిపోయాయి. థియేటర్స్ మల్టీప్లెక్స్ మూతబడిపోయాయి. విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. దీంతో సినిమా మీద ఆధారపడి బ్రతుకుతున్న కొన్ని లక్షల కుటుంబాలు ఉపాధి లేక జీవనం సాగించడం కష్టంగా మారింది. ఈ సంక్షోభం నుండి సినీ ఇండస్ట్రీ బయటపడటానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సినిమా - సీరియళ్ల షూటింగ్‌కు సంబంధించి త్వరగా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుదంటూ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిసి లేఖ అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ''కరోనా మహమ్మారితో సినీ ఇండస్ట్రీ చాలా నష్టపోయింది.. ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరికి ఇబ్బంది.. నష్టం కలిగిన మాట వాస్తవమే. కానీ త్వరలోనే మంచి రోజులు వస్తాయి. సినిమా, సీరియళ్ల షూటింగుల పైనే ఆధార పడి చాలా మంది కార్మికులు బతుకుతున్నారు. వారందరికి రేషన్ కార్డుల ద్వారా ఏ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశాం. అలాగే కరోనా క్రైసిస్ చారిటీ ఏర్పాటు చేయడం శుభ పరిణామం. ఇప్పటి వరకు ఈ ఛారిటీ ద్వారా 14 వేల మంది సినీ కార్మకులను ఆదుకోవడం గొప్ప విషయం. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ పెద్దలతో మీటింగ్ లు జరిగాయి. కరోనాతో బ్రేక్ పడింది.. కానీ బెస్ట్ పాలసీతో ముందుకు వస్తాం. లాక్ డౌన్ తర్వాత ఇండస్ట్రీ తో చర్చలు జరుపుతాం. సింగిల్ విండో పాలసీతో ముందుకు వెళ్తాము. షూటింగ్ విషయంలో తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం. జూన్ నుంచి షూటింగ్ లు మొదలయ్యే అవకాశం ఉంది. ఈ విషయంపై రెండు రాష్ట్రాలు చర్చించి త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తాం'' అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సినీ నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ... చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీకి లీడ్ తీసుకొని చెయ్యడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 14వేల మంది సినీ వర్కర్స్ కి నిత్యావసరాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటికీ వైజాగ్, విజయవాడ, తిరుపతి లో కూడా వున్న సినీ వర్కర్స్ కి ఇచ్చామని.. ఎవరు ఇబ్బంది పడకుండా అందరికీ సీసీసీ సహాయం చేస్తుందని వెల్లడించారు. లాక్ డౌన్ తరువాత చిరంజీవి ఆధ్వర్యంలో ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని తెలిపారు.