అక్కడ నిరూపించి ఇక్క‌డికొస్తున్నాడు!- దిల్ రాజు

Update: 2023-01-12 16:17 GMT
సంక్రాంతి పందెంలో వ‌రుస‌గా భారీ సినిమాలు విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. జన‌వ‌రి 12న వీర‌సింహారెడ్డి జ‌న‌వ‌రి 13న వాల్తేరు వీర‌య్య లాంటి భారీ సినిమాల విడుద‌ల హాట్ టాపిక్ గా మారింది. వీర‌సింహారెడ్డి ఈ శుక్ర‌వారం విడుద‌లై భారీ ఓపెనింగుల‌ను ద‌క్కించుకుంది. ఈ శ‌నివారం (జ‌న‌వ‌రి13) నుంచి మెగాస్టార్ వాల్తేరు వీర‌య్య హంగామా స్టార్ట్ కానుంది. ఈ రెండు సినిమాల కంటే ముందే త‌మిళంలో ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన వారిసు విడుద‌లైంది. ఇప్పుడు తెలుగు వెర్ష‌న్ `వార‌సుడు` జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది.

రిలీజ్ కి రెండ్రోజుల ముందే త‌మిళ మీడియాకి ప్రివ్యూ షో వేసిన నిర్మాత దిల్ రాజు మీడియా స్టాండింగ్ ఓవేష‌న్ తో క్లాప్స్ ని ఇవ్వ‌డం త‌మ‌ న‌మ్మ‌కాన్ని నిజం చేసింద‌ని అన్నారు. థియేట‌ర్ల‌లో అంద‌రూ ప్రివ్యూ చూస్తుంటే నేను మెట్ల‌పై నిల‌బ‌డి ఎవ‌రి స్పంద‌న‌లు ఎలా ఉన్నాయో ప‌రిశీలించాను. షో చూశాక మీడియా స‌హా అంద‌రూ క్లాప్స్ కొడుతుంటే అన్నీ మ‌ర్చిపోయాం. రిలీజ్ కి ప‌ది రోజుల ముందు మేం పడ్డ క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. నా 50 సినిమాల కెరీర్ లో నేను ఎప్పుడూ ఇలా చూడ‌లేదు. వంశీ -థ‌మ‌న్ క‌ద‌ల‌కుండా హార్డ్ వ‌ర్క్ చేసి మంచి ఔట్ పుట్ తీసుకొచ్చారు.

ప్రివ్యూ షోలో క్లైమాక్స్ పూర్త‌యాక‌ ప‌రిగెత్తుకెళ్లి వంశీని హ‌త్తుకున్నాను. అప్ప‌ట్లో `బొమ్మ‌రిల్లు` సినిమా శాంతి థియేట‌ర్లో చూసిన‌ప్పుడు నాకు ఫోన్ కాల్ లో మాట్లాడిన‌వి విన్న త‌ర్వాత ఉద్వేగంతో ఏడ్చాను. మ‌ళ్లీ అంత‌గా కళ్ల‌లో నీళ్లు వ‌చ్చాయి. వారిసు చూసిన వారి స్పంద‌న‌లు చూశాక‌ భావోద్వేగానికి గుర‌య్యాను. ఆ త‌ర్వాత కూడా ఆడియెన్ తో 5 పీఎం షో చూసాను. అక్క‌డ రెస్పాన్స్ చూసి థ‌మ‌న్ వంశీ కూడా భావోద్వేగానికి గురై ఏడ్చేశారు. జ‌న‌వ‌రి 10న‌ నైట్ ప్రివ్యూ షో ఆ త‌ర్వాత 11 జ‌న‌వ‌రి ఉద‌యం ఆట‌తో `వారిసు`కి జ‌రిగిన అనుభ‌వం.

ఇప్పుడు తెలుగులో `వార‌సుడు` రిలీజ్ చేస్తున్నాం. జ‌న‌వ‌రి 14 నుంచి ఈ సినిమా తెలుగు ఆడియెన్ ని అల‌రించ‌నుంది. ఆర్టిస్టులు టెక్నీషియ‌న్లు రాజీ లేకుండా క‌ష్టప‌డుతున్నారు. వివేక్ త‌మిళ డైలాగుల రైట‌ర్ సహా అంద‌రూ మంచి వ‌ర్క్ చేస్తున్నారు. థ‌మ‌న్ చ‌క్క‌ని సంగీతం అందించాడు. త‌న‌తో నాలుగు సినిమాలు చేసాను. ఈ సినిమా కోసం అత‌డు ఎంతో హార్డ్ వ‌ర్చ్ చేశాడు. రేయింబ‌వ‌ళ్లు నిద్ర‌లేకుండా రోజుకు రెండు గంట‌లే నిదురించి మ‌రీ ప‌ని చేసాడు. ఒక సినిమా కోసం తాను శ్ర‌మిస్తూ అంద‌రితో గొప్ప ప‌ని చేయించుకుంటారు వంశీ. ఇలా స‌క్సెస్ లు సాధించాలి. మంచి సినిమాల‌తో ముందుకు వెళ్లాలి అత‌డు.. అని అన్నారు.

సుమన్ - ప్ర‌కాష్ రాజ్ -శ‌ర‌త్- శ్రీ‌కాంత్- శ్యాం -ప్ర‌భు -ఎస్.జె సూర్య - విజ‌య్ ఇంత‌మంది హీరోలు వార‌సుడులో న‌టించారు. అంద‌రితో అంత మంచి ఔట్ పుట్ తీసుకున్నాడు వంశీ. ఈ సినిమా చూస్తుంటే ప్ర‌తి ఇంట్లో అమ్మా నాన్న కొడుకు ఇందులో స‌న్నివేశాల‌ను వోన్ చేసుకుంటున్నారు. కుటుంబ స‌భ్యులంద‌రికీ సినిమా రీచ్ అయింది. మా బ్యాన‌ర్ లో జ‌య‌సుధ గారు చేసిన సినిమాల‌న్నీ విజ‌యం సాధించాయి. వార‌సుడు కూడా విజ‌యం సాధిస్తుంది.

విజ‌య్ త‌మిళ్ సూప‌ర్ స్టార్. వార‌సుడుతో తెలుగులోను విజ‌యం సాధిస్తాడు. నేడు గ‌ర్వంగా మీ దిల్ రాజు.. మీ వంశీ త‌మిళంలో కి వెళ్లి అక్క‌డ ఒక బ్లాక్ బస్ట‌ర్ కొట్టి మీ ముందుకు వ‌స్తున్నాం. వార‌సుడును తెలుగు వారికి అందిస్తున్నాం. ఈరోజు చాలా గ‌ర్వంగా ఉంది. అక్క‌డ గోల్డెన్ గ్లోబ్స్ లో మ‌న ఆర్.ఆర్.ఆర్ సినిమా ఘ‌న‌త‌కు గ‌ర్వంగా ఉంది.  

స‌క్సెస్ అంటే డ‌బ్బే కాదు.. దాంతో వ‌చ్చే ఎమోష‌న్.. ఫీలింగ్..

సంక్రాంతికి గ‌తంలో ఎవ‌డు- శ‌త‌మ‌నం భ‌వ‌తి-  ఎఫ్ 2 ఇలా విజ‌య‌వంత‌మైన సినిమాలు రిలీజ్ చేసాం. ఇప్పుడు వార‌సుడుతో వ‌స్తున్నాం. ఈ సినిమాతోను విజ‌యం అందుకుంటున్నాం. తెలుగు ప్రేక్ష‌కులు సంక్రాంతికి కుటుంబ స‌మేతంగా సినిమాలు చూడాల‌నుకుంటారు. అలాంటి కంటెంట్ ఉన్న సినిమా మా వార‌సుడు. ఈ నెల 14 నుంచి తెలుగు రాష్ట్రాల్లో నిరూప‌ణ కానుంది. ఆల్రెడీ నిరూపించిన సినిమాతో మీ ముందుకు వ‌స్తున్నాం! సంక్రాంతికి పెద్ద విజ‌యం అందుకుంటామ‌ని న‌మ్మ‌కంగా ఉన్నాం.

వీర‌సింహారెడ్డి అద్భుత ఓపెనింగులు సాధింంచింది. ఈ శ‌నివారం నాడు చిరంజీవి- ర‌వితేజ గారి సినిమా వాల్తేరు వీర‌య్య‌ పెద్ద స‌క్సెస్ కావాలి. జ‌న‌వ‌రి 14 నుంచి మా `వార‌సుడు` సినిమా ఆడుతుంది. అంద‌రికీ డ‌బ్బు రావాలి. అంద‌రూ బావుండాలి.. అని దిల్ రాజు అన్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News