• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రిలీజ్ డేట్లపై కొంచెం...

రిలీజ్ డేట్లపై కొంచెం క్లారిటీ వచ్చింది

By - Tupaki Desk
Update: 2016-11-22 19:30 GMT
పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో కలకలం రేగింది. కొత్త సినిమాల రిలీజ్ డేట్లన్నీ తారుమారైపోయాయి. గత రెండు వారాల్లో రావాల్సిన చాలా సినిమాలు వెనక్కి వెళ్లిపోయాయి. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియక గందరగోళంలో పడిపోయారు జనాలు. ఐతే ఇప్పుడు నెమ్మదిగా క్లారిటీ వస్తోంది. తర్వాతి రెండు మూడు వారాల్లో ఏ సినిమా ఎప్పుడొస్తుందో ఒక క్లారిటీ వచ్చేసింది. వాటిలో ఏ సినిమా ఏమాత్రం ఆకర్షిస్తోందో చూద్దాం పదండి.

ఈ శుక్రవారం శ్రీనివాసరెడ్డి సినిమా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ మంచి అంచనాల మధ్య విడుదలవుతోంది. దీనికి పోటీగా రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు రేసులో ఉన్నాయి. అందులో ఒకటి ‘రెమో’. దిల్ రాజు ఈ సినిమా పోస్టర్ మీదికి రావడం.. దీనికి తోడు పబ్లిసిటీ ఓ రేంజిలో చేస్తుండటంతో తెలుగు ప్రేక్షకుల్ని బాగానే ఆకర్షిస్తోందీ సినిమా. మరోవైపు జీవా మూవీ ‘రంగం-2’ను కూడా ఈ శుక్రవారమే రిలీజ్ చేస్తున్నారు కానీ.. జనాలకు ఆ సినిమా పట్టేలా లేదు.

ఇక తర్వాతి వారం విషయానికి వస్తే.. ఈ నెల 18 నుంచి వాయిదా పడ్డ ‘బేతాళుడు’ డిసెంబరు 1న వచ్చేస్తున్నాడు. విజయ్ ఆంటోనీకి గురువారం సినిమాల్ని రిలీజ్ చేసే సెంటిమెంటు ఉండటంతో ఈ చిత్రాన్ని కూడా ఆ రోజే రిలీజ్ చేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఆ రోజే ఆ చిత్రం రిలీజవుతుంది. మోహన్ లాల్ హీరోగా నటించిన మరో డబ్బింగ్ మూవీ ‘మన్యం పులి’ మరుసటి రోజు.. అంటే డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఆ రోజే అల్లరి నరేష్ సినిమా ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. తర్వాతి వీకెండ్ కు ‘ధృవ’ ఫిక్సయింది. ఆ తర్వాతి వారం రావాల్సిన ‘సింగం-3’ విషయంలో కొంచెం సస్పెన్స్ నడుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Tollywood Movies 
  • Telugu NEws 

Similar News

టాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌ కొత్త ఆఫర్ల పరిస్థితి ఏంటి?

2026-11-16 19:30 GMT

సాయి పల్లవి దగ్గర నాగవంశీ అడ్వాన్స్ డబ్బులు.. వెనక్కి ఇచ్చిన తీసుకోలేదంటూ కామెంట్స్..!

2026-11-16 19:12 GMT

విడిపోయినా వీడని బంధం.. స్టార్ క‌పుల్స్ ప‌రిణ‌తికి హ్యాట్సాఫ్‌

2026-11-16 19:12 GMT

నెల ముందే రెడీ అంటున్న సంక్రాంతి సినిమాలు

2026-11-16 19:08 GMT

3.5 కోట్ల లగ్జరీ కార్ గిఫ్ట్ అందుకున్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్!

2026-11-16 19:08 GMT

బాలకృష్ణ 'దాదా' సందడి షురూ, బిజినెస్‌ అదుర్స్‌!

2026-11-16 19:07 GMT

రామాయణ చైనీస్ వర్షన్ రెడీ అవుతుందట!

2026-11-16 19:05 GMT

జుట్టు కట్ చేసుకున్న సాయి పల్లవి.. షాకైన మమ్మీ-డాడీ!

2026-11-16 19:04 GMT

అనీల్ రావిపూడి తో తార‌క్ ప్ర‌యోగం ఎలాంటిది!

2026-11-16 18:56 GMT

15 ఏళ్ల సంగీత ప్రయాణం పూర్తి.. ఎమోషనల్ అయిన అనిరుధ్!

2026-11-16 18:55 GMT

పెళ్లి గంటలో ముగించ‌క‌పోతే మంటపం నుంచి లేచిపోతా!

2026-11-16 18:30 GMT

టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల ఎంట్రీ!

2026-11-16 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS