2022 పైనే ఆశలు పెట్టుకున్న టాలీవుడ్..!

Update: 2021-05-12 02:30 GMT
చిత్రపరిశ్రమలో ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఓవైపు దేశంలో ప్రశాంతత లేదు.. మరోవైపు సామాన్యుల జీవితాలలో ఆనందం లేకుండా పోయింది. ఇదంతా కేవలం కరోనా వైరస్ మహమ్మారి కారణంగానే అని అందరికి తెలిసిందే. గతేడాది కాలంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తుంది. ఇప్పటికే కరోనా వలన నష్టపోయిన దేశాలలో ఒకటిగా ఇండియా కోలుకోలేని నష్టంలో మునిగింది. అందులోను ఎంతోమంది ఆత్మీయులు - అభిమానులు - అభిమాన నటులు ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భయంకరమైన వాతావరణం నెలకొంది.

ఎవరు ఎప్పుడు ఏ విధంగా కరోనా బారినపడుతున్నారో తెలియకుండానే ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. ప్రస్తుతం ఈ భయాందోళనలు టాలీవుడ్ సినీ సెలబ్రిటీలలో నెలకొన్నాయి. ఎందుకంటే కరోనాతో హాస్పిటల్ లో చేరిన వారికీ తిరిగి వచ్చే అవకాశం కష్టంగా మారుతున్న సమయం ఇది. అందుకే ఆల్రెడీ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఆపేసారు మేకర్స్. మరోవైపు సినీ ఇండస్ట్రీలో కరోనా కల్లోలం ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం షూటింగ్స్ - ఫోటోషూట్స్ - సినిమాలు అన్నిటికీ బ్రేక్ పడినట్లే. అందుకే టాలీవుడ్ స్టార్ హీరోలు కరోనా పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సినిమాలు ఇప్పట్లో చేయాలా వద్దా అనే ఆలోచనలో పడిపోయారు.

కానీ ఆఖరికి నిర్ణయం మాత్రం ఇప్పట్లో సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు పలువురు స్టార్స్ ఒక్కొక్కరుగా ప్రకటిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి సమయంలో ప్రాణాలు రిస్క్ లో పెట్టడం మంచిది కాదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరోలు మరో మూడు నెలలు సినిమా షూటింగ్స్ లో పాల్గొనమని నిర్మాతలకు తేల్చి చెప్పేశారట. ఆ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అందులోను ఆల్రెడీ మే జూన్ జులై నెలలకు సంబంధించిన సినిమాలు - షెడ్యూల్స్ అన్ని కాన్సల్ అయిపోయాయి. ఇలాంటి సమయంలో లైఫ్ రిస్క్ లో పెడితే కరెక్ట్ కాదని స్టార్స్ గుర్తు చేస్తున్నారు. మరి 2020 కరోనాకు బలైంది. ఇప్పుడు 2021 కూడా సగం ముగిసింది. అంటే ఇకపై ఆశలన్నీ 2022 మీదే అని అర్ధమవుతుంది.
Tags:    

Similar News