రౌడీ జనార్ధన OST.. కంటెంట్ పై మరో క్లారిటీ ఇచ్చేశారు
విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో వస్తున్న 'రౌడీ జనార్ధన' సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది.;
విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో వస్తున్న 'రౌడీ జనార్ధన' సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. రీసెంట్ గా టైటిల్ అనౌన్స్మెంట్ గ్లింప్స్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక సినిమాను ఒక రా అండ్ రస్టిక్ మూవీగా ప్రచారం చేస్తున్నారు. దానికి తగ్గట్టే ఇప్పుడు సినిమా టైటిల్ గ్లింప్స్ కి సంబంధించిన ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఆడియో ట్రాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న క్రిస్టో జేవియర్, ఈ OST విషయంలో పూర్తిగా ఇంటెన్స్ అప్రోచ్ తీసుకున్నట్లు వినిపిస్తోంది. మామూలు కమర్షియల్ సినిమాలకు ఉండే రెగ్యులర్ బీట్స్ కాకుండా, కాస్త వైల్డ్ గా, డార్క్ థీమ్ కు సెట్ అయ్యేలా సౌండ్ డిజైన్ చేశారు. హెవీ డ్రమ్స్, బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే హమ్మింగ్ సినిమా మూడ్ ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేశాయి.
మ్యూజిక్ వింటుంటే హీరో పాత్రలో ఉండే పెయిన్, ఆవేశం రెండూ స్పష్టంగా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. కేవలం సౌండ్ మాత్రమే కాకుండా, అందులో ఒక ఎమోషన్ క్యారీ అయ్యేలా ట్యూన్ కంపోజ్ చేసినట్లు అనిపిస్తోంది. యాక్షన్ సన్నివేశాల్లో ఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
ఇక వీడియోలో చూపించిన విజువల్స్ విషయానికి వస్తే, పూర్తిగా డార్క్ లైటింగ్, మంటల బ్యాక్ డ్రాప్ లో డిజైన్ చేశారు. విజయ్ దేవరకొండ ఒంటి నిండా గాయాలతో, చేతిలో ఆయుధం పట్టుకుని నడిచి వస్తున్న షాట్ సినిమాలో యాక్షన్ డోస్ ని సూచిస్తోంది. ఇది క్లాస్ సినిమా కాదు, పక్కా మాస్ యాక్షన్ డ్రామా అని ఈ విజువల్స్ ద్వారా డైరెక్టర్ హింట్ ఇచ్చినట్లయింది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ ఈ గ్లింప్స్ లో డీసెంట్ గా కనిపిస్తున్నాయి. రవికిరణ్ కోలా టేకింగ్, దానికి క్రిస్టో జేవియర్ మ్యూజిక్ తోడవ్వడంతో టెక్నికల్ గా సినిమా స్ట్రాంగ్ గానే ఉండేలా ఉంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
ఇక 'రౌడీ జనార్ధన' OST సినిమాపై ఒక ఆసక్తిని అయితే క్రియేట్ చేసింది. మరీ ఓవర్ హైప్ కాకుండా, సినిమా జానర్ ఏంటో స్పష్టంగా చెప్పడానికి ఈ ఆడియో ట్రాక్ ఉపయోగపడింది. విజయ్ ని కొత్తగా చూపించడానికి చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో సినిమా వస్తే గానీ తెలియదు.