ఫోకస్ : నిన్నటి హీరోలే నేటి విలన్లు

Update: 2015-09-22 17:30 GMT
ఒకే వ్యక్తిని అటు నాయకుడిగానూ ఇటు ప్రతినాయకుడిగానూ ఆదరించగలిగే మనసు మనది. టాలెంట్ వుండాలే గానీ ఏ పాత్రకైనా జీవం పోయడం పెద్ద కష్టంకాదు. సినిమాలలో హీరోగా వ్యవహరించి అభిమానులను సంపాదించుకుని ఒకింత స్టార్ డం ఏర్పరుచుకుని ఆపైన విలన్ గా నటించాలంటే ఎంతో మధనపడాలి. అటువంటి మనఃమధనం పొంది విలన్ పాత్రలను సైతం రక్తికట్టించిన హీరోలలో కొందరు..
 
ఈ జాబితాలో నేటి తరం సినిమాలలో ఈ వైపు అడుగులు వేసిన తొలి వ్యక్తి శ్రీహరి అనే చెప్పాలి. రియల్ స్టార్ గా తనకంటూ ఒకే ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నా అటు ప్రతినాయక ఛాయలున్న పాత్రలను సైతం వదులుకోకుండా కొత్త ఒరవడి సృష్టించాడు. శ్రీహరి చెయ్యకపోతే ఎన్నో పాత్రలు మరుగునపడిపోయేవే.

హీరోగానే ఎంట్రీ ఇచ్చిన అల్లరి నరేష్ కి స్వతహాగా విలన్ రోల్స్ అంటే ఇష్టం. అందుకే విశాఖ ఎక్స్ ప్రెస్ సినిమాలో ఇటువంటి అవకాశం రాగానే వెంటనే ఒప్పుకున్నాడు. నరేష్ ఫేవరెట్ యాక్టర్ ఎవరంటే రఘువరన్ అనే చెప్తాడు.

కరాటే హీరోగా పేరు గడించిన సుమన్ సైతం రెండో ఇన్నింగ్స్ లో విలన్ పాత్రలకు సై అన్నాడు. శివాజీ సినిమాలో రజినీ తగ్గ ప్రతినాయకుడిగా మెప్పించాడు.

గోపీచంద్ హీరోగా చేసిన తొలి సినిమాకంటే విలన్ గా నటించిన జయం - నిజం సినిమాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యాడు.
 
ఇక ఈ జోనర్ లో ఇటీవల పెనుసంచలనంగా నిలిచిన నటుడు జగపతిబాబు. లెజెండ్ సినిమా ద్వారా తనలోనూ ఒక విలన్ వున్నాడని నిరువుపించి వరుసపెట్టి బడా ఆఫర్లు సొంతం చేసుకున్నాడు.

యువ నటుడు అడవి శేష్ కూడా ఈ కోవకు చెందినవాడే. కర్మ - కిస్ లతో హీరోగా మెప్పించలేకపోయినా పంజా - బాహుబలి సినిమాలలో విలన్ పాత్రలకు ఫేమస్ అయ్యాడు.
Tags:    

Similar News